స్మార్ట్ యాచన | Smart Village | Sakshi
Sakshi News home page

స్మార్ట్ యాచన

Published Sat, Apr 18 2015 2:44 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM

స్మార్ట్  యాచన - Sakshi

స్మార్ట్ యాచన

జిల్లాలో ముందుకు సాగని స్మార్ట్ విలేజ్
దత్తత తీసుకోవాల్సిందేనంటూ కలెక్టర్ హుకుం
వివిధ వర్గాలపై అధికారుల ఒత్తిడి

 
సాక్షి, చిత్తూరు : జిల్లాలో ‘స్మార్ట్’ పేరుతో అధికారులు యాచనకు దిగారు. గ్రామాలను దత్తత తీసుకునేందుకు దాతలను వెతకాల్సిందేని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అధికారులకు హుకుం జారీచేస్తున్నారు. దీంతో అధికారులు వివిధ వర్గాలపై ఒత్తిడి పెంచారు. ఈ ఏడాది జనవరి 18న సీఎం ఈ  కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా గ్రామాల్లో అందరికీ గృహవసతి, మరుగుదొడ్లు, రక్షిత మంచినీరు, నిరంతర విద్యుత్ సదుపాయం కల్పించడం లక్ష్యం.

దీంతోపాటు ప్రతి కుటుంబానికి జీవనోపాధి అవకాశాలు, స్వయం సహాయక సభ్యులకు శిక్షణ, బ్యాంకు, మార్కెటింగ్ అనుసంధానంతో గ్రామీణ సూక్ష్మ సంస్థల అభివృద్ధి, బాల్య వివాహాలను అరికట్టడం తదితర 20 అంశాలతో మొత్తంగా గ్రామాన్ని సుందరంగా మార్చాలి ఆయా గ్రామాల్లో పుట్టి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులను భాగస్వాములను చేసి గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. దాతలు ముందుకు రాని పక్షంలో ప్రభుత్వమే నిధులిచ్చి స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి నడుం బిగిస్తుందని ముఖ్యమంత్రి  చెప్పారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు రావడం లేదు. మరోవైపు ప్రభుత్వం కూడా పైసా వెచ్చించలేదు.

ఇప్పుడు స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే బాధ్యత అధికారులపై పడింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే కార్యక్రమం విజయవంతం కాలేదన్న అపవాదు నుంచి బయటపడేందుకు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆధ్వర్యంలో అధికారులు యాచన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 1,363 పంచాయతీలున్నాయి. అన్ని పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల అభివృద్ధికి సైతం దాతలను వెతకాల్సి ఉంది.  కార్యక్రమం ప్రారంభమై నాలుగు నెలలు కావొస్తున్నా  ఇప్పటివరకు కేవలం 660 మంది దాతలను మాత్రమే వెతికినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ లెక్కన ఇంకా 2వేల మందిని వెతికితే తప్ప స్మార్ట్ విలేజ్ విజయవంతమయ్యే పరిస్థితి కానరావడం లేదు. దీంతో మరింత సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ శ్రీకారం చుట్టారు. జిల్లాలో 1,363 పంచాయతీలున్నాయి. అన్ని పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల అభివృద్ధికి సైతం దాతలను వెతకాల్సి ఉంది.  కార్యక్రమం ప్రారంభమై నాలుగు నెలలు కావొస్తున్నా  ఇప్పటివరకు కేవలం 660 మంది దాతలను మాత్రమే వెతికినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ లెక్కన ఇంకా 2వేల మందిని వెతికితే తప్ప స్మార్ట్ విలేజ్ విజయవంతమయ్యే పరిస్థితి కానరావడం లేదు. దీంతో మరింత సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ వారం రోజుల పాటు వరుసగా సమావేశాలు పెట్టి అధికారులను హడలెత్తిస్తున్నారు. దాతలను వెతకాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేశారు. దీంతో అధికారులు గ్రానైట్, క్వారీ, క్రషింగ్ యూనిట్లు, పరిశ్రమలు, సంస్థలకు  చెందిన యజమానులను పిలిపించి ఇప్పటికే సమావేశాలు పెట్టారు. విద్యాసంస్థలు, చిరు వ్యాపారులు, చోటా మోటా నేతలను సైతం వదలడం లేదు.

స్మార్ట్ విలేజ్‌లో భాగస్వాములు కావాల్సిందేనంటూ బలవంతంగా పేర్లు నమోదు చేయిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దత్తతదారులను పట్టుకునే క్రమంలో అధికారులు సామ, భేద, దండోపాయాలను సైతం ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల బాధ భరించలేకున్నామని పలువురు ‘సాక్షి’తో వాపోయారు.

గ్రామాలు, వార్డులను కూడా తమ సొంత డబ్బులతో అభివృద్ధి చేసేటప్పుడు అసలు ప్రభుత్వం ఎందుకు ఉన్నట్లు..? అంటూ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. తీరా సొంత డబ్బులు ఖర్చు చేసినా పేరు ప్రభుత్వం చేయించినట్లే వస్తుందని,  సొమ్ము జనానిది.. సోకు ప్రభుత్వానిదన్నట్లు ఉంది తప్ప మరొకటి కాదని పలువురు విమర్శిస్తున్నారు. స్మార్ట్ విలేజ్‌కు దాతలను వెతకడం తలకు మించిన భారంగా మారిందని కొందరు అధికారులు  వాపోయారు. ముఖ్యమంత్రి వరుస జిల్లా పర్యటనల ఖర్చుతో జిల్లా మొత్తం స్మార్ట్ జిల్లాగా మారిపోయి ఉండేదని కొందరు అధికారులు బాహాటంగా వ్యాఖ్యనించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement