సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని సాలూర, సలాబత్‌పూర్, పొందుర్తి చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు వరుసగా దాడులు నిర్వహించారు. పలువురు ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ఇక్కడ అనధికారికంగా పనిచేస్తూ అక్రమంగా డబ్బులు కలిగి ఉన్న ప్రయివేట్ వ్యక్తుల ను ఆరెస్టు చేసి కేసులు పెట్టారు. అయినా చెక్‌పోస్టు ల వద్ద మార్పు కనిపించకపోగా దారిదోపిడీ మరిం త ఎక్కువైంది. దీనికి ప్రధాన కారణం కేసుల నమో దు తర్వాత అక్రమార్కులపై చర్యలు నామమాత్రంగానే ఉండటమేనని తెలుస్తోంది.
పలుకుబడితో
రాజకీయ పలుకుబడి, పైరవీలతో అక్రమార్కులు కేసుల నుంచి బయట పడటమే కాకుండా, ధన బలం తో మళ్లీ పాత స్థానాలకే పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు. దీంతో జిల్లాలోని రవాణ శాఖ చెక్‌పోస్టులు దారిదోపిడీకి నిలయాలుగా మారాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల సర్కారు ఆదాయానికి గండికొడుతున్న ఈ ఆర్టీఏ చెక్‌పోస్టులు దళారులు, ఉద్యోగులు, వారు నియమించుకునే ప్రయివేటు వ్యక్తులకు ఆదాయ వనరులుగా మారాయి. రవాణా శాఖలో పెరిగిన అంతులేని అవి నీతికి ఇవి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. భిక్కనూరు మండలం పొందు ర్తి, బోధన్ మండలం సాలూర, మద్నూర్ మండలం సలాబత్‌పూర్‌లో రవాణా శాఖ చెక్‌పోస్టు లను నిర్వహిస్తున్నది. ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా ఇక్కడ పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల పరిస్థితి ‘కుక్కతోక వంకర’ అన్నట్లుగానే ఉంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే చెక్‌పోస్టుల వద్ద దారిదోపిడీ పెరుగుతోందని అంటున్నారు.
వందల వాహనాల రాకపోకలు
జాతీయ రహదారి పక్కన మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన పొందుర్తి చెక్‌పోస్టు మీదుగా ప్రతి రోజు 200 నుంచి 300 వరకు వాహనాలు వెళ్తుంటాయి. నిత్యం ప్రభుత్వానికి జరిమానాలు, పన్నుల పేరిట రూ. 70 వేల నుంచి రూ. 90 వేల వరకు ఆదాయం వస్తోంది. సిబ్బంది, ప్రయివేటు వ్యక్తులకు మాత్రం ప్రతి నెల రూ.మూడు లక్షలనుంచి రూ. ఆరు లక్షల వరకు మమూళ్ల రూపేణా అందుతున్నట్లు తెలుస్తోంది.
మరో రెండింటిలోనూ అంతే
సాలూర, సలాబత్‌పూర్ చెక్‌పోస్టులలో కూడా ఇదే దందా కొనసాగుతోంది. ఇక్కడ కూడా పలుమార్లు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. అయినా ఎలాంటి మార్పు లేదు. ఈ చెక్‌పోస్టులో పనిచేయడానికి ఉద్యోగులు లక్షాలాది రూపాయలు ఖర్చుపెట్టి పోస్టింగ్ తెచ్చుకుంటున్నారన్న ఆరోపణరలు ఉన్నా యి. రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల ఆశీస్సులు ఉన్నవారికే ఇక్కడ పోస్టింగ్ లభిస్తుంది. అవినీతి, అక్రమాలతో పట్టుబడినప్పటికీ, అదే పలుకుబడి, ధనబ లం తో బయటపడుతున్నారని అంటున్నారు.
ఈ చెక్‌పోస్టుల మీదుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ, తమిళనాడు నుంచి సరుకులు మన రాష్ట్రానికి దిగుమతి అవుతుంటాయి. మన రాష్ట్రం నుంచి బియ్యం, నూకలు, పొద్దు తిరుగుడు, సోయా, పత్తి, శనగ లోడ్లతో వాహనాలు వెళుతుంటాయి. ఇవే కాకుండా ప్రైవేట్ వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. సాలూర చెక్‌పోస్టు నుంచి 500కు పైగా వాహనాలు, సలాబత్‌పూర్ నుంచి 700 నుంచి 800కుపైగా లారీలు ప్రతి రోజు వచ్చిపోతుంటాయి. మార్బుల్ రాయితో పాటు జీరో సరుకులు రవాణా చేస్తారు. అక్రమంగా సరుకులను రవాణా చేస్తున్న వాహనాల నుంచి పలువురు ఉద్యోగు లతోపాటు దళారులకు ప్రతి నెల రూ. అరకోటికి పైగానే మమూళ్ల రూపంలో అందుతున్నాయి.
కుక్కతోక వంకర
Published Tue, Jan 21 2014 6:49 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement