అనంతపురం: ఇంట్లో నిద్రిస్తుండగా కట్లపాము ప్రవేశించి తండ్రి, కుమార్తెలను కాటు వేసింది. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా ఉవరకొండ మండలం రేణుమాకులపల్లి గ్రామంలో జరిగింది. అనుమంతప్ప, అతని కుమార్తె అక్షయలు ఇంట్లో నిద్రిస్తున్నారు. ఇంతలో ఇంటి పక్కనే ఉన్న పొదల్లోంచి వచ్చిన కట్లపాము ఇంట్లోకి ప్రవేశించి కాటు వేసింది.
దీంతో వెంటనే వీరిద్దరిని అనంతపురం ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పాము కరిచిందని నిర్ధారించారు. కాగా, ప్రస్తుతానికి తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉండగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.