హైదరాబాద్: జీ హెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో శనివారం రసాభాస చోటుచేసుకుంది. ఈ సమావేశం నుంచి కమిషనర్ సోమేష్ కుమార్ వాకౌట్ చేశారు. ఆయనతోపాటు మిగతా అధికారులు కూడా వెంట వచ్చినట్టు తెలుస్తోంది. సోమేష్ కుమార్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాల్గొన్న తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. అందులోనే సభ్యుల ప్రవర్తన పట్ల ఆయన నొచ్చుకుని ఏకంగా సమావేశం నుంచి వాకౌట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
కౌన్సిల్‌లో సభ్యులు అమర్యాదగా మాట్లాడుతున్నారని పలువురు అధికారులు ఆరోపిస్తున్నారు. కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కొంతమంది సభ్యులు తమపట్ల అమర్యాదగా మాట్లాడటం వల్లే తాము సమావేశం నుంచి వాకౌట్ చేసినట్టుగా వారు తెలిపారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ వాకౌట్
Published Sat, Dec 21 2013 6:14 PM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement
Advertisement