దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనక సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, రిలయన్స్ సంస్థల హస్తముందని ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఆరోపించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబునాయుడు తహతహలాడుతున్నారని, అసలు చంద్రబాబు నాయుడు సమైక్యవాదో, విభజనవాదో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబు అబద్ధాల కోరు అని, దమ్ముంటే ఆయన సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖ ఇవ్వాలని గుర్నాథరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసిన తర్వాత మాత్రమే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరగాలని ఆయన అన్నారు.