సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నవంబర్ 2న రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో తలపెట్టిన ఏరియల్ సర్వే రద్దయింది. తొలుత అక్టోబర్ 31న రాష్ట్రంలో ఏరియల్ సర్వే నిర్వహించాలని వారు భావించారు. అనివార్య కారణాల వల్ల అది ఈనెల రెండో తేదీకి వాయిదా పడింది. అయితే ప్రస్తుత ం ఏరియల్ సర్వే వల్ల వాస్తవ పరిస్థితులు తెలిసే అవకాశం లేదని, క్షేత్రస్థాయి పర్యటనకు వెళితేనే నష్టం అంచనా వేసేందుకు వీలవుతుందని ప్రభుత్వ వర్గాలు భావించాయి. కానీ, విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉందనే నివేదికలు అందడంతో.. ప్రధాని, సోనియాలు ఆ ఆలోచన కూడా విరమించుకున్నట్లు తెలిసింది.