షార్‌లో స్పేస్ మ్యూజియం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో అంతరిక్ష శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలతో మ్యూజియం ఏర్పాటవుతోంది. స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి క్రమాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించేందుకు అనేక సాంకేతిక పరికరాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీ కోర్సులు చదివే వారితో పాటు షార్ సందర్శనకు వచ్చే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాకెట్ ప్రయోగ నమూనాను మ్యూజియంలో డిజైన్ చేశారు. ఉపగ్రహాల డిజైనింగ్ కూడా జరుగుతోంది. షార్‌లోని కురూప్ ఆడిటోరియం పక్కనే భారీ భవనాన్ని నిర్మించి అందులో ఈ ఏర్పాట్లన్నీ చకాచకా చేస్తున్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి షార్ సందర్శనకు వచ్చే వారిని దీనిలోకి అనుమతిస్తామని షార్ వర్గాలు తెలిపాయి.