sri hari kota
-
నింగిలోకి దూసుకెళ్లిన PSLV C58 రాకెట్
-
శ్రీహరికోట నుండి నింగిలోకి పీఎస్ఎల్వీ సీ- 48
-
రేపు షార్కు ప్రధాని మోడీ
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్కు చేరుకోనున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇక్కడికి రానున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో చెన్నైకి వచ్చే మోడీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సాయంత్రం 4.30 గంటలకు షార్కు వస్తారు. గవ ర్నర్, సీఎం మాత్రం ఓ గంట ముందుగానే ఇక్కడికి చేరుకుంటారు. గుంటూరు రేంజ్ ఐజీ సునీల్‌కుమార్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సుమారు 3 వేల మంది పోలీసులు, 30 మంది ఎస్పీజీ కమాండోలు షార్కు చేరుకున్నారు. -
భద్రతా వలయంలో షార్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ సీ23 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రానున్న నేపథ్యంలో శ్రీహరికోటలోని షార్‌లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే షార్ చుట్టూ స్థానిక పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలు మోహరించాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ ఈ నెల 29వ తేదీ షార్కు రానున్న సంగతి తెలిసిందే. చెన్నై విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో ఆయన షార్కు చేరుకుంటారు. పధాని వెంట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు వీఐపీలు రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు షార్‌లో మూడు హెలిపాడ్లు సిద్ధం చేస్తున్నారు. షార్కు చేరుకున్న ప్రధానిని మొదటి రోజు రాకెట్ లాంచింగ్ ప్యాడ్‌ను సందర్శించనున్నారు. 30వ తేదీ ఉదయం పీఎస్ఎల్వీ సీ23 ప్రయోగాన్ని వీక్షించనున్నారు. ఆయన 29వ తేదీ రాత్రి షార్‌లోని భాస్కర గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్న నేపథ్యంలో పోలీసులు, భద్రతా దళాలతో పాటు అధికారులు అప్రమత్తమయ్యారు. అడుగడుగునా నిఘా జిల్లాలోని తడ నుంచి కావలి వరకు ఉన్న 169 కిలోమీటర్ల తీరప్రాంతంలో మెరైన్ పోలీసులు గస్తీ కాస్తున్నారు. సోమవారం నుంచే పోలీసు బలగాలు షార్కు చేరుకుని, చుట్టుపక్కల ఉన్న అడవుల్లో కూంబింగ్ చేస్తున్నాయి. షార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న తోటకట్ట, అటకానితిప్ప, రాగన్న పట్టెడ, తిప్ప, కొన్నత్తూరు తదితర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులను అక్కడ నుంచి ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరు ఈనెల 30వ తేదీ వరకు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వీలు లేదని పోలీసులు హుకుం జారీ చేశారు. ఇప్పటికే షార్కు మెరైన్ పోలీసులు, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు చేరుకున్నాయి. వీరు కాకుండా తమిళనాడు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన పోలీసులను అదనంగా రప్పిస్తున్నారు. రెండు రోజుల్లో ప్రధానమంత్రి ప్రత్యేక భద్రతా దళం కూడా షార్కు రానుంది. నేడు ఎస్పీజీ ఐజీ రాక భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి బుధవారం ఢిల్లీ నుంచి ఎస్పీజీ ఐజి చతుర్వేది శ్రీహరికోటకు రానున్నారు. ఆయనతో పాటు అదనపు ఐజీలు సుధనుష్ సింగ్, సుమిత్ర రాయ్ మరో నలుగురు అధికారులు ఢిల్లీ నుంచి చెన్నై మీదుగా వస్తారని అధికారులు తెలిపారు. ప్రధాని 30వ తేదీన ఉదయం 9.49 గంటలకు రాకెట్ ప్రయోగం ముగిసిన తర్వాత ప్రత్యేక హెలికాఫ్టర్‌లో 11 గంటలకు చెన్నైకి బయలుదేరుతారు. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారు. ప్రధాని బయలుదేరేంత వరకు భద్రతా ఏర్పాట్లను ఐజీ చతుద్వేరి పర్యవేక్షించనున్నారు. బాబు కోరికను మన్నించని మోడీ ప్రధాని మోడీ చెన్నై మీదుగా కాకుండా రేణిగుంట విమానాశ్రయం మీదుగా శ్రీహరికోటకు చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరికను ప్రధాని మన్నించలేదని తెలిసింది. రేణిగుంట నుంచి శ్రీహరికోట దగ్గరని, ఆంధ్రప్రదేశ్‌లోనే మోడీ విమానం దిగాలని కోరుతూ టెలిఫోన్లో సంభాషించిన విషయం తెలిసిందే. మొదట సరేనన్న మోడీ, తరువాత భద్రత దృష్ట్యా చెన్నై మీదుగానే శ్రీహరికోటకు చేరుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. షార్‌లో హెలీప్యాడ్ల వద్ద బందోబస్తు షార్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులకు వేర్వేరుగా ఏర్పాటు చేసి హెలీప్యాడ్ల వద్ద మంగళవారం బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం అదనంగా 20 మంది రిజర్వ్ పోలీసులను షార్కు పంపారు. ఈ 20 మందిని ఒక్కో హెలీప్యాడ్ వద్ద పదేసి మందిని ఏర్పాటు చేశామని ఎస్సై జీ గంగాధర్‌రావు చెప్పారు. ప్రధాని రాకతో షార్‌లో 50 మంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌తో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. షార్ అటవీప్రాంతాన్ని, సముద్ర తీరప్రాంతాన్ని, తీరప్రాంత గ్రామాల్లో కూంబింగ్‌ను కొనసాగిస్తున్నారు. షార్‌లోని సీఐ ఎస్ఎఫ్ సిబ్బందికి ప్రధాని పర్యటన పూర్తయ్యేదాకా సెలవులు ఇవ్వద్దని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలిసింది. -
షార్‌లో స్పేస్ మ్యూజియం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో అంతరిక్ష శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలతో మ్యూజియం ఏర్పాటవుతోంది. స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి క్రమాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించేందుకు అనేక సాంకేతిక పరికరాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నారు. స్పేస్ టెక్నాలజీ కోర్సులు చదివే వారితో పాటు షార్ సందర్శనకు వచ్చే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాకెట్ ప్రయోగ నమూనాను మ్యూజియంలో డిజైన్ చేశారు. ఉపగ్రహాల డిజైనింగ్ కూడా జరుగుతోంది. షార్‌లోని కురూప్ ఆడిటోరియం పక్కనే భారీ భవనాన్ని నిర్మించి అందులో ఈ ఏర్పాట్లన్నీ చకాచకా చేస్తున్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి షార్ సందర్శనకు వచ్చే వారిని దీనిలోకి అనుమతిస్తామని షార్ వర్గాలు తెలిపాయి. -
అంతరిక్షంలో మహాప్రస్థానం
అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్- మంగళ్యాన్)ను ప్రయోగించి సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది ఈ ఏడాదే. నవంబర్ 5వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన ఈ ప్రయోగం.. భారత గ్రహాంతర పరిశోధనల్లో మొట్టమొదటిది. దీంతో అమెరికా, రష్యా, ఐరోపా అంతరిక్ష సంస్థల తర్వాత అరుణగ్రహంపైకి ఉపగ్రహాలను ప్రయోగించిన నాలుగో దేశంగా, ఆసియాలో మొట్టమొదటి దేశంగా రికార్డుకెక్కింది. కేవలం 15 నెలల కాలంలో.. అతి తక్కువగా రూ. 450 కోట్ల ఖర్చుతోనే ఈ ప్రాజెక్టును అమలుచేయటం మరో విశేషం. ప్రస్తుతం అంగారక గ్రహం దిశగా ప్రయాణం సాగిస్తున్న ‘మామ్’ 2014 సెప్టెంబరులో ఆ గ్రహాన్ని చేరుతుంది -
తీరం ఎంత భద్రం?
సాక్షి, నెల్లూరు : పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముంబైలో దాడులకు పాల్పడి మంగళవారానికి ఐదేళ్లు గడిచింది. 2008 నవంబర్ 26న ముంబైలో దాడులకు దిగి మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. భూమి, ఆకాశాల మీదుగా కాకుండా ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ప్రవేశించి మారణహోమం సృష్టించడంతో దేశం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ఈ దాడులు సముద్ర తీరభద్రత డొల్లతనాన్ని తేట తెల్లం చేసింది. ఆ తర్వాత తీరం భద్రతపై దృష్టిపెట్టినా ఇప్పటికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గుజరాత్ తర్వాత మన రాష్ట్రంలో అత్యధికంగా సముద్ర తీర ప్రాంతం ఉంది. ఒక్క నెల్లూరు జిల్లా పరిధిలోనే సుమారు 190 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. దీంతో రాష్ట్రంలో భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. అందులో భాగంగా తీర ప్రాంతంలో మెరైన్‌పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జిల్లా పరిధిలో దుగ్గరాజపట్నం, శ్రీహరికోట, కృష్ణపట్నం, ఇస్కపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే మెరైన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సమర్థులైన సిబ్బంది నియామకం, పరికరాలు, బోట్లు, బైనాక్యులర్స్ తదితరాలు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపలేదన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ముఖ్యంగా మెరైన్ పోలీస్ స్టేషన్లు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్నింటికి సొంతభవనాలు కూడా లేవు. ఇస్కపల్లి మెరైన్ పోలీస్‌స్టేషన్ అద్దెభవనంలో కొనసాగుతోంది. దీనికి బోటు కూడాలేదు. ఇక సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అంటూ లేదు. కనీసం ఈతరాని వారిని మెరైన్ పోలీస్ స్టేషన్లో నియమించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సాధారణ శాంతి భద్రతల్లో పనిచేస్తూ వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పనిష్మెంట్ కింద మాత్రమే మెరైన్ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తున్నారు. దీంతో ఆసక్తి లేకుండానే సిబ్బంది పనిచేయాల్సి వస్తోంది. అధికారులు సైతం ఎక్కువ కాలం పని చేయడం లేదు. ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో కొద్దిరోజులకే లా అండ్ ఆర్డర్‌కు వెళ్లిపోతున్నారు. ఇక మెరైన్ పోలీస్ స్టేషన్ల ప్రారంభంలో సిబ్బందికి అన్ని రకాల వసతులు, ప్రయోజనాలు కల్పిస్తామన్న అధికారుల మాటలు నీటి మూటలే అయ్యాయి. అదనపు అలవెన్సులు, టీఏలు అసలే లేవు. మెరైన్ విధులు సముద్రంలో మెరైన్ పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాల్సి ఉంది. తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు మెరైన్ పోలీసులు గస్తీ నిర్వహించాల్సి ఉంది. నిత్యం తీరంలో ఉదయం, సాయంత్రం, రాత్రి గస్తీ నిర్వహించాల్సి ఉంది. అందుకు సంబంధించి వీరికి బోట్లు, బైనాక్యులర్స్, ఇంటర్నెట్ తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. మత్స్యకారులతో సత్సంబంధాలు నెరుపుతూ మెరైన్ పోలీసులు పనిచేయాలి. సముద్రంలో కొత్తవారి కదలికలు, సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుని పోలీసులు, నిఘా విభాగాలకు తక్షణం తెలపాలి. కాని మెరైన్ పోలీసుల దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సంగతి దేవుడెరుగు బోట్లే కాదు, బైనాక్యులర్స్, లైఫ్ జాకెట్స్ సైతం లేవు. షార్, కృష్ణపట్నం పోర్టు భద్రత ప్రశ్నార్థకం ప్రపంచంలో రాకెట్ లాంచింగ్ సెంటర్‌గా పేరు పొందిన షార్ జిల్లాలోనే ఉంది. తూర్పు సముద్ర తీరం 50 కిలో మీటర్ల బంగాళాఖాతం షార్ పరిధిలో ఉంది. అయితే ఇంత సుదీర్ఘ తీరప్రాంతంపై భద్రత నామమాత్రంగా ఉంది. గతంలో బాంగ్లాదేశ్‌కు చెందిన యువకుడు సముద్ర మార్గం గుండా ప్రవేశించి దుమారం రేపిన విషయం, భారీ స్థాయిలో షార్కు చెందిన సామగ్రి సముద్ర ప్రాంతం వద్ద దొరకడం గమనార్హం. ఈ రెండు ఉదాహరణలు షార్ పరివాహక ప్రాంతంలో భద్రత డొల్లతనాన్ని తెలియచేస్తోంది. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం, విలువైన శాస్త్రజ్ఞులు నిత్యం దేశ, విదేశీ ప్రతినిధులతో ప్రయోగాలు చేసే షార్ రక్షణపై దీర్ఘ ప్రణాళికతో వ్యవహరించాల్సి ఉంది. కృష్ణపట్నం పోర్టులో కోస్టుగార్డు ప్రధాన కార్యాలయం ఉంది. మెరైన్ రక్షణ సిబ్బంది కొరత, సౌకర్యాలు అంతత మాత్రమే ఉన్నాయి. విదేశీ వర్తక నౌకలు తరచూ వచ్చే ఈ ప్రాంతంలో సిబ్బంది కొరత రక్షణను ప్రశ్నార్థకంగా చేస్తోంది. స్టాండింగ్ కమిటీ సూచనలు అమలు కాని వైనం.. తీరం భద్రతపై గతేడాది కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు నేతృత్వంలో కమిటీ సభ్యులు తూర్పు తీర ప్రాంతంలో భద్రతపై విసృ్తత పరిశీలన చేశారు. అవసరమైన సూచనలు, సలహాలను ఇస్తూ కేంద్ర హోం శాఖకు నివేదికను సమర్పించారు. జిల్లాలోని షార్, కృష్ణపట్నం పోర్టుల భద్రతపై తీసుకోవాల్సిన అతి కీలక అంశాలను వారు ఈ నివేదికలో పొందు పరిచారు. అయితే సంవత్సరం గడుస్తున్నా ఆ నివేదికలు కార్యాచరణ దాల్చక పోవడం బాధాకరం. తరచూ కలెక్టర్, ఎస్పీ, నేవీ, కోస్టుగార్డు, మెరైన్ తదితర శాఖల అధికారులు సమావేశమై తీరం భద్రతపై సమీక్షించాల్సి ఉంది. ఈ సమావేశాలు మొక్కుబడిగా సాగుతుండటంతో తీర ప్రాంత భద్రత లోప భూయిష్టంగా మారుతోంది. గగన, భూ మార్గాలకంటే జల మార్గంలో విదేశీయులు, ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశాలు సులువుగా ఉన్నాయనే విషయాలు అధికారులకు తెలిసినప్పటికీ తీర ప్రాంత భధ్రతపై శీతకన్ను వేయడం బాధాకరం. ప్రమాదాలు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు భద్రతపై చర్చలు జరిపేకంటే ముందస్తు చర్యలు పాటించి తీర ప్రాంతాన్ని, దేశ భద్రతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తీర ప్రాంత వాసులు, దేశ ప్రజలు కోరుతున్నారు. -
రాకెట్ ప్రయోగాల్లో నిష్ణాతులుగా ఎదగండి
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : దేశంలో సాంకేతిక అభివృద్ధి కోసం చేస్తున్న రాకెట్ ప్రయోగ టెక్నాలజీలో నిష్ణాతులుగా ఎదగాలని షార్ సీనియర్ శాస్త్రవేత్త వీఆర్ కట్టి ఇంజనీర్లకు సూచించారు. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లోని వివిధ సెంటర్ల నుంచి ఎంపిక చేసిన 50 మంది ఇంజినీర్లకు షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో ఏర్పాటు చేసిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీఆర్ కట్టి మాట్లాడుతూ 40 ఏళ్లుగా ఇస్రోలో పనిచేసి, తొలి ఉపగ్రహమైన ఆర్యభట్ట నుంచి మూడో తరం ఉపగ్రహాలైన ఇన్శాట్-3ఈ వరకూ వివిధ హోదాల్లో పనిచేసి ఎంతో అనుభవాన్ని గడించానని చెప్పారు. గడిచిన 50 ఏళ్ల అంతరిక్ష యానంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న ఒడిదుడుకులను కూడా వారికి వివరించారు. మన ఉపగ్రహాలను ఇతర దేశాలకు చెందిన అంతరిక్ష కేంద్రాల నుంచి ప్రయోగించే స్థాయి నుంచి మనమే ప్రయోగించే స్థాయికి ఎదిగామన్నారు. షార్‌లో రెండు ప్రయోగ వేదికలను నిర్మించుకుని వంద ప్రయోగాల మైలు రాళ్లను దాటామని చెప్పారు. సమాచార ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు జీఎస్ఎల్వీ రాకెట్లలో క్రయోజనిక్ దశను రూపొందించి ప్రయోగాలు చేసే స్థాయి కి ఎదిగామని చెప్పారు. ఇస్రో ఇక నుంచి భవిష్యత్ అంతా భారీ ప్రయోగాల మీదే దృష్టి సారించిందని, దీనికి మీ వంతుగా మంచి ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా భావితరాల వారికి అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని కోరారు. కార్యక్రమ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు పీ విజయసారథి మాట్లాడుతూ ఈ బృహత్ కార్యనిర్వహణ సిద్ధాంత పరంగా 1950లోనే ప్రపచంలోని అన్ని దేశాల్లో ప్రారంభమైనప్పటికి 113 (ఏడీ) సంవత్సరంలోనే దీన్ని తెలియకుండా ఆచరిస్తున్నారని వివరించారు. 37 ఏళ్లు నాసాలో పని చేసిన జెర్రి మబ్డీన్, హెన్రీగాన్ట్ (1861-1919) మధ్యలో వీరు ప్రవేశపెట్టిన సిద్ధాంతాలను మనం స్మరిస్తూ ఆచరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో షార్‌లోని అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు