అంతరిక్షంలో మహాప్రస్థానం | great achievement in aero space | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో మహాప్రస్థానం

Published Mon, Dec 30 2013 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

అంతరిక్షంలో మహాప్రస్థానం

అంతరిక్షంలో మహాప్రస్థానం

అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్- మంగళ్‌యాన్)ను ప్రయోగించి సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది ఈ ఏడాదే. నవంబర్ 5వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన ఈ ప్రయోగం.. భారత గ్రహాంతర పరిశోధనల్లో మొట్టమొదటిది. దీంతో అమెరికా, రష్యా, ఐరోపా అంతరిక్ష సంస్థల తర్వాత అరుణగ్రహంపైకి ఉపగ్రహాలను ప్రయోగించిన నాలుగో దేశంగా, ఆసియాలో మొట్టమొదటి దేశంగా రికార్డుకెక్కింది. కేవలం 15 నెలల కాలంలో.. అతి తక్కువగా రూ. 450 కోట్ల ఖర్చుతోనే ఈ ప్రాజెక్టును అమలుచేయటం మరో విశేషం. ప్రస్తుతం అంగారక గ్రహం దిశగా ప్రయాణం సాగిస్తున్న ‘మామ్’ 2014 సెప్టెంబరులో ఆ గ్రహాన్ని చేరుతుంది

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement