హైదరాబాద్: త్వరలో రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి నీటిని విడుదల చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండు రాష్ట్రాలు విడివిడిగా రివర్ బోర్డ్స్ వేసుకునే వరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గాను ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇందులో ఇరు రాష్ట్రాల నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శులు, ఇంజనీరింగ్ చీఫ్ లు, జెన్ కో డైరెక్టర్లు, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లను సభ్యులుగా నియమించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన రిజర్వాయర్ల నుంచి రెండు రాష్ట్రాల ఆయకట్టులకు నీటి విడుదలను పర్యవేక్షించనుంది.