మహానంది (కర్నూలు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీతో కూడిన హోదాను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మాలతీరాణి చెప్పారు. ఆదివారం మహానందిలోని మహానందీశ్వరుడిని ఆమె దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి ఓ కార్పెట్‌ను విరాళంగా అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక ప్యాకేజీతో కూడిన హోదాను కేంద్రం ఇవ్వనుందని మాలతీరాణి తెలిపారు.