'కేంద్రం అనుకుంటే ప్రత్యేక హోదా ఒక పనే కాదు' | special status of andhra pradesh is our right, says buggana rajendranath reddy | Sakshi
Sakshi News home page

'కేంద్రం అనుకుంటే ప్రత్యేక హోదా ఒక పనే కాదు'

Published Tue, Sep 1 2015 2:52 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

special status of andhra pradesh is our right, says buggana rajendranath reddy

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాజధానిని కోల్పోయిన సంగతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మరోసారి గుర్తు చేశారు. ఏపీ రాష్ట్ర విభజనను అన్యాయంగా, దుర్మార్గంగా చేశారని  బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు.  ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం మాట్లాడిన బుగ్గన..  ఆనాడు విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

 

ఏ రోజుకైనా హక్కు అనేది హక్కుగానే ఉంటుందని..  కేంద్ర కేబినెట్ అనుకుంటే ప్రత్యేక హోదా అనేది సమస్యే కాదన్నారు.  బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ వద్దని.. ప్రత్యేక హోదా కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేసిన సంగతిని బుగ్గన  సభ దృష్టికి తీసుకువచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement