జ్యోతులతో జగన్
కాకినాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నెహ్రూకు సూచించారు. జ్యోతుల శనివారం హైదరాబాద్‌లో జగన్‌ను కలిసి, గుంటూరులో ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన నిరవధిక నిరాహారదీక్షపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రత్యేకహోదా సాధన విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీలకు మధ్య వ్యత్యాసాన్ని వివరించాలన్నారు. నిరవధిక దీక్ష జరగకుండా ప్రభుత్వం అడ్డుపడుతున్న అంశంపై నేతలు చర్చించారు. ప్రత్యేక హోదా డిమాండ్ ప్రజల్లో ఎంతో బలంగా ఉందని, అందుకోసం జరిగే దీక్షకు అన్ని వర్గాల సహకారం లభిస్తుందని జగన్‌కు జ్యోతుల చెప్పారు. దీక్ష సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జ్యోతుల వెంట పార్టీ నాయకుడు భూపాలపట్నం ప్రసాద్ ఉన్నారు.
‘హోదా’పై ప్రజల్ని చైతన్యపరచండి
Published Sun, Sep 27 2015 12:30 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement