Nehru jyotula
-
టీడీపీ టికెట్‌పై గెలవగలరా?
♦ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వైఎస్సార్సీపీ సవాల్ ♦ చంద్రబాబుది రాజకీయ వ్యభిచారం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నుంచి అధికారపక్షంలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీ టికెట్‌పై పోటీ చేసి గెలవాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సవాలు విసిరారు. వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని మండిపడ్డారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీ మారిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నుంచి అభ్యర్థిని ఎవరు నిలబెట్టాలనేది కూడా వారే నిర్ణయించుకోవచ్చని ఆ ‘ఛాయిస్’ను కూడా తాము వారికే ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు అధికారపక్షంలోకి వెళ్లినంత మాత్రాన ప్రజల్లో మార్పు లేదని ప్రజలంతా వైఎస్సార్సీపీ పక్షానే ఉన్నారని, ఎన్నికలు జరిగితే జగన్‌కు ఎపుడెపుడు ఓటేయాలా అని ఎదురు చూస్తున్నారన్నారు. ఏం చూసి వెళ్లారు?: నలుగురు ఎమ్మెల్యేలు ఏం చూసి చంద్రబాబు పార్టీలోకి వెళ్లారు? చంద్రబాబు పాలన ప్రజాహితంగా సాగుతోందని వెళ్లారా? ఎన్నికలపుడు ఇచ్చిన రైతుల, డ్వాక్రా మహిళల రుణ మాఫీని అమలు చేశారని వెళ్లారా? నిరుద్యోగ సమస్య, కాపుల సమస్య పరిష్కరిస్తున్నారని వెళ్లారా? అని సూటిగా ప్రశ్నించారు. కేవలం దొంగ కేసులు, అవినీతి సూట్‌కేసుల కోసమేననేది స్పష్టమవుతోందన్నారు. శ్రీనివాసులు మాట్లాడుతూ తాను పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేల చేత చంద్రబాబు రాజీనామా చేయించి నైతిక విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. పిన్నెల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కినపుడు చేసిన తొలి ఐదు సంతకాలు ఎందుకు అమలు చేయలేక పోతున్నారో చంద్రబాబు అవలోకించుకోవాలన్నారు. -
‘హోదా’పై ప్రజల్ని చైతన్యపరచండి
జ్యోతులతో జగన్ కాకినాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నెహ్రూకు సూచించారు. జ్యోతుల శనివారం హైదరాబాద్‌లో జగన్‌ను కలిసి, గుంటూరులో ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన నిరవధిక నిరాహారదీక్షపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రత్యేకహోదా సాధన విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీలకు మధ్య వ్యత్యాసాన్ని వివరించాలన్నారు. నిరవధిక దీక్ష జరగకుండా ప్రభుత్వం అడ్డుపడుతున్న అంశంపై నేతలు చర్చించారు. ప్రత్యేక హోదా డిమాండ్ ప్రజల్లో ఎంతో బలంగా ఉందని, అందుకోసం జరిగే దీక్షకు అన్ని వర్గాల సహకారం లభిస్తుందని జగన్‌కు జ్యోతుల చెప్పారు. దీక్ష సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జ్యోతుల వెంట పార్టీ నాయకుడు భూపాలపట్నం ప్రసాద్ ఉన్నారు. -
అలా చెప్పుకోవడానికి సిగ్గులేదా?
నదుల అనుసంధానమని గొప్పలా? సీఎంను నిలదీసిన జ్యోతుల నెహ్రూ హైదరాబాద్: నదుల అనుసంధానం తానే చేశానని గొప్పలు చెప్పుకోవడానికి సీఎం చంద్రబాబుకు సిగ్గులేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానమనేది చంద్రబాబు చిరకాల కోరికని సాగునీటిశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటపుడు తన తొమ్మిదేళ్ల పాలన(1995-2004)లో సీఎం కనీసం ఆలోచనలు కూడా చేయలేదెందుకని ప్రశ్నించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు మాయమాటలు చెప్పి రాష్ట్రప్రజల్ని మభ్య పెట్టేయత్నం చేస్తున్నారని విమర్శించారు. చరిత్ర పుటల్లోకి వెళ్లిచూడండి.. చరిత్ర పుటల్లోకి వెళితే ఆర్థర్ కాటన్ నిర్మించిన గోదావరి బ్యారేజీ కాలువకు, కృష్ణా బ్యారేజీ కాలువ ఏలూరు వద్ద కలుస్తుందని, ఆ కాలువ చాలా రోజులపాటు నావికా అవసరాలకు ఉపయోగపడిందని నెహ్రూ తెలిపారు. 1978లో జలగం వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా-చిత్రావతి-కుందూలను కలుపుతూ పెన్నానది అనుసంధానానికిగాను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు శంకుస్థాపన చేశారన్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ సోమశిల, కండలేరును కలుపుకుని తెలుగుగంగ అని పేరు పెట్టారన్నారు. దివంగత వైఎస్ హయాంలో చాలాభాగం పనులు పూర్తయి ఈరోజు సోమశిల డ్యాంలోకి నీరు వస్తోందని తెలిపారు. ఇదంతా నదుల అనుసంధానంతోనే సాధ్యమైందనే విషయం టీడీపీ నేతలకు తెలిసి కూడా ఇప్పుడే చేసినట్లు చెప్పుకోవడం, ఎమ్మెల్యేలు డ్యాన్సులు చేసి డప్పులు కొట్టుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. తాడిపూడిని పూర్తిచేసింది వైఎస్.. తాడిపూడి పథకానికి చంద్రబాబు శంకుస్థాపన చేసి నిధులు కేటాయించకుండా వదిలేస్తే భారీగా నిధులిచ్చి నిర్మాణం పూర్తిచేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని నెహ్రూ తెలిపారు. ఈ పని చంద్రబాబు చేశానని చెప్పుకోవడానికి సిగ్గులేదా? అని దుయ్యబట్టారు. -
ఇవన్నీ ప్రభుత్వ హత్యలే
గోకవరం : కల్తీకల్లు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటనను వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించారు. గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో కల్తీకల్లు తాగి మృతి చెందిన నాగులపల్లి దుర్గారావు, దాకారపు శ్రీను కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ వ్యక్తిగతంగా రూ. పది వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జరిగిన సంఘటన చూస్తే ఇవి ప్రభుత్వ హత్యలేనన్నారు. ప్రభుత్వ లోపభూయిష్టం, ఎక్సైజ్‌శాఖ అనాలోచిత విధానం వ ల్ల ఈ సంఘటన జరిగిందన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్ల సొసైటీ నిర్వహణ లేకపోవడం, ఎక్సైజ్‌శాఖ అధికారులు బాధ్యతలు, విధివిధానాలు గుర్తెరగకపోవడం వలన కల్తీకల్లు నిరోధించలేక రాష్ట్రంలో తరచూ ఈ సంఘటనలు జరుగుతున్నాయన్నారు. బాధిత కుటుంబాల పరిస్థితి రెక్కాడితేకానీ డొక్కాడని పరిస్థితని, వీరి కుటుంబాల్లో ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారన్నారు. జరిగిన సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. పది లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులపై దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు పాలూరి బోసుబాబు, పార్టీ నాయకులు జనపరెడ్డి బాబు, వరసాల ప్రసాద్, అత్తులూరి నాగబాబు, భూపాలపట్నం ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు మొగలి వెంకటరమణ, చింతల సత్యవాణి, మండల కన్వీనర్ మంగరౌతు రామకృష్ణ, సెక్రటరీ కర్రి సూరారెడ్డి తదితరులు ఉన్నారు. చిచ్చు పెట్టే యత్నాలు వద్దు గోకవరం : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా పార్టీ పరంగా జరిగిన రేవంత్‌రెడ్డి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పక్కదారి పట్టిస్తున్నారని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. గోకవరంలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ఇటీవలి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు రూ.90 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధపడ్డారని, కానీ రాష్ట్రంలో బీద అరుపులు అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ఉదంతానికి చంద్రబాబు బాధ్యత వహించాలే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని రెచ్చగొట్టడం తగదని, హితవు పలికారు. -
‘బాబు’కూ భాగస్వామ్యం
రేవంత్‌రెడ్డి వెనకున్నది ఆయనే వైఎస్సార్ సీపీ నేతల ఆరోపణ పార్టీ అధినేత, సీఎం పదవులకు రాజీనామా చేయూలని డిమాండ్ సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి అక్కడి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రయత్నించిన వ్యవహారంలో తెరవెనుక సూత్రధారి అని ఏపీ సీఎం చంద్రబాబుపై వివిధ వర్గాల నుంచి నిరసన పెల్లుబుకుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు రాజకీయాలను అవినీతి మయంచేసిన బాబుపై కేసు నమోదుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన సోమవారం రాత్రి కిర్లంపూడి మండలం ముక్కొల్లులో పార్టీ జిల్లా నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. చంద్రబాబు తెరవెనుక ఉండి నడిపించిన మంత్రాంగంలో రేవంత్‌రెడ్డి పావుగానే ఏసీబీకి దొరికిపోయారని నేతలు అన్నారు. నెహ్రూ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు అవినీతి నిర్మూలన అంటాడు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ అవినీతి రాజకీయాలన్నట్టు ఆయన వ్యవహారశైలి ఉంది’ అని ఆక్షేపించారు. చంద్రబాబు భాగస్వామ్యంతో రేవంత్‌రెడ్డి సాగించిన అవినీతి వ్యవహారాన్ని పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అవినీతి రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయగా అందులో భాగస్వామి అయిన చంద్రబాబు పార్టీ పదవికి, సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ తనకు తాను అన్నా హజారే వారసుడనని చెప్పుకునే చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ప్రత్యక్ష పాత్ర ఉందని, ఆయన సీఎంగా ఉండే అర్హత కోల్పోయారని అన్నారు. పార్టీ జిల్లా అధికారప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి వ్యవహారంలో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలంతా టీడీపీ అవినీతి రాజకీయాలను ఎండగడుతూ ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కాగా జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి రేవంత్‌రెడ్డి వ్యవహారంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏలేశ్వరం బస్టాండ్ సెంటర్లో పార్టీ నాయకుడు ఆలమండ చలమయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ వ్యవహారంలో రేవంత్‌రెడ్డితో పాటు చంద్రబాబును కూడా బాధ్యుడిని చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నేతలు డిమాండ్ చేశారు. సమరదీక్షకు సన్నద్ధం : జ్యోతుల ప్రజలకిచ్చిన హామీలను తుంగలోతొక్కి ప్రజాకంటక పాలన సాగిస్తోన్న చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరిలో చేపట్టనున్న సమరదీక్షకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం తెలియచేసేందుకు తరలివెళ్లాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. జగన్ తలపెట్టిన రెండురోజుల సమరదీక్ష ఏర్పాట్లపై ముక్కొల్లులో నెహ్రూ అధ్యక్షతన నేతలు చర్చించారు. జిల్లా నేతలు, పార్టీ శ్రేణులు రావులపాలెం మండలం గోపాలపురం నుంచి బయలుదేరాలని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం జగన్ దీక్ష చేపట్టే సరికి అక్కడకు వెళ్లి దీక్ష ముగిసే వరకు అక్కడే ఉండేలా నేతలంతా ఏర్పాట్లు చేసుకోవాలని నెహ్రూ, బోస్ విజ్ఞప్తి చేశారు. 11న కొత్త కార్యవర్గం పరిచయం వైఎస్సార్సీపీ జిల్లా కొత్త కార్యవర్గం, రాష్ట్రపార్టీలో పదవులు వరించిన నేతల పరిచయ కార్యక్రమం ఈ నెల 11న కాకినాడ సూర్యకళామందిరంలో నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబులను ఆహ్వానించామని నెహ్రూ చెప్పారు. పార్టీ పదవులు పొందిన నేతలంతా ఈ పరిచయ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అదే కార్యక్రమంలో పార్టీ నేతలకు గుర్తింపు కార్డులు, పదవుల నియామకపత్రాలు అందజేస్తామన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, గిరజాల వెంకటస్వామినాయుడు, తోట సుబ్బారావునాయుడు, గుత్తుల సాయి, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, ఎం.వెంకటేష్, సుంకర చిన్ని, మిండగుదిటి మోహన్, కర్రి పాపారాయుడు, పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు అనంత ఉదయభాస్కర్, మండపాక అప్పన్నదొర, శిరిపురపు శ్రీనివాస్, ముమ్మిడివరం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ కాశి మునికుమారి, అత్తులూరి సాయిబాబు, కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబును ఎ-2గా చేయాలి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డబ్బులు ముట్టచెబుతూ టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి పట్టుబడ్డ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎ-2గా చేయాలని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ డిమాండ్ చేశారు. వీడియో క్లిప్పింగ్‌ల ఆధారంగా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకపక్క శాసనసభ్యులను సంతలో పశువుల్లా కొంటున్నారని చంద్రబాబు చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండడం లేదని, నీతి, అవినీతిై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. చంద్రబాబు నైజం బయటపడింది.. మహానాడులో తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రత్యర్థులు ప్రలోభాలకు గురి చేసి సంతలో పశువులు కొన్నట్టు కొంటున్నారన్న చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే పనికి పాల్పడడం ద్వారా అతని అసలు నైజం బయటపడిందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ఎమ్మెల్యేలకు ఎరలు వేసిన రేవంత్‌రెడ్డితోపాటు అతడిని ప్రోత్సహించిన చంద్రబాబుపైనా కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇదేనా అన్నా హజారే వారసత్వం..? రేవంత్‌రెడ్డి వీడియోక్లిప్పింగ్లను చంద్రబాబు చూసి నైతిక బాధ్యత తీసుకుని తప్పును ఒప్పుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. అన్నాహజారే వారసుడిగా చెప్పుకునే చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలన్నారు. సీఎం పదవికి బాబు అనర్హుడన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కూడబెట్టిన డబ్బులతోనే ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రాలోనూ నామినేటెడ్ పదవులకు ఎరవేసిన రేవంత్‌రెడ్డికి ఆంధ్రా అంటే అంత లోకువా అని ప్రశ్నించారు. టీడీపీ నైజం బయటపడింది.. రేవంత్‌రెడ్డి వ్యవహారంతో టీడీపీ నైజం బయటపడిందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అన్నారు. అవినీతిపై మాట్లాడే చంద్రబాబు నాయుడు రే వంత్‌రెడ్డి విషయంలో దొరికిపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యతయుతమైన పదవిలో ఉంటూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. అది ఎర్రచందనం సొమ్మే.. నీతుల వల్లించే చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయమని ప్రోత్సహించడం అవినీతి కాదా అని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. తెలంగాణ లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఎర్రచందనం సొమ్మును ఉపయోగిస్తున్నారనడానికి రేవంత్‌రెడ్డి నిర్వాకమే నిదర్శనమన్నారు. మీడియా కథనాల ఆధారంగా చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు నీతిపరులో, అవినీతి పరులో రెండు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందన్నారు. చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది.. డబ్బుతో రాజకీయాల్ని శాసించడం, అక్రమమార్గాల్లో ఎన్నికల్లో గెలవడం చంద్రబాబుకు తెలిసినట్టు మరెవరికీ తెలియదని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ దొరికిపోయిన రేవంత్‌తో పాటు ఈ వ్యవహారం మొత్తానికి బాధ్యుడైన చంద్రబాబును తక్షణం అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు అసలు రూపం బయటపడిందన్నారు. చంద్రబాబును అరెస్టు చేయాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను డబ్బుతో కొనేందుకు ప్రయత్నించి దొరికిపోయిన రేవంత్‌రెడ్డితోపాటు అతని బాస్ చంద్రబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ డిమాండ్ చేశారు. కుటిల రాజకీయం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన మామ ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారకుడయ్యారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకూ భాగస్వామ్యముంది.. రేవంత్‌రెడ్డి కుటిల రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి భాగస్వామ్యం ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడంలో ఆరితేరిన చంద్రబాబు నైజం రేవంత్‌రెడ్డి వ్యవహారంతో మరోసారి రుజువైందన్నారు. ఈ కేసులో బాబు పైనా అభియోగం మోపి, విచారించాలన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కుతంత్రాల బాబును వెనకేసుకొస్తున్న టీడీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. చంద్రబాబే ‘ఏ-1’ ముద్దాయి.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు యత్నించిన విషయంలో ఏ-1 ముద్దాయి చంద్రబాబేనని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌కు ముడుపులిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడినా ఇందుకు ప్రోత్సహించింది చంద్రబాబేనన్నారు. జరిగినదానికి నైతిక బాధ్యత వహించి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యేని డబ్బులతో కొనుగోలు చేయూలని ప్రయత్నించి ఏసీబీకి పట్టుబడ్డ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి చంద్రబాబు తప్పుకోవాలి. ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేయాలి. చంద్రబాబు నీతిరహిత రాజకీయాలకు పాల్పడుతున్నారు. - జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత -
‘ఎత్తిపోతల’కు వ్యతిరేకంగా పోరుబాట
14న పోలవరం, పట్టిసీమల వద్ద భారీ హోమం అవసరమైతే దీర్ఘకాల కార్యాచరణకు సన్నద్ధం ముఖ్యనేతల సమావేశంలో వైఎస్సార్ సీపీ నిర్ణయం కాకినాడ : గోదావరి డెల్టా రైతులకు అపారనష్టాన్ని కలిగించేలా పట్టిసీమ వద్ద ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్యమబాట పట్టనుంది. ఉభయగోదావరి జిల్లాల రైతాంగాన్ని భాగస్వాముల్ని చేస్తూ పోలవరం సాధనే లక్ష్యంగా కార్యాచరణకు సమాయత్తమవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన గురువారం సాయంత్రం కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంలో ముఖ్యనేతలంతా సమావేశమయ్యూరు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేలా స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 14న ఉదయం పోలవరంపై ప్రభుత్వాలకు సద్భుద్ధి ప్రసాదించి రైతులకు మంచి జరగాలని కాంక్షిస్తూ పోలవరం వద్ద భారీ హోమం చేయాలని నిర్ణయించారు. అక్కడి నుంచి పట్టిసీమకు పాదయాత్ర చేసి అక్కడ కూడా హోమం చేయనున్నారు. అనంతరం జరిగే సభలో రైతులు, ప్రజలు, పార్టీ నేతల సూచనల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుకు అక్కడే కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. కేవలం స్వల్పకాలిక ఆందోళనలే కాక దీర్ఘకాల కార్యాచరణ చేపట్టాలన్న ప్రతిపాదనపై కూడా నేతలు చర్చించారు. అంకితభావం గల కార్యకర్తలకు జిల్లా కమిటీలో అవకాశం కాగా పార్టీ జిల్లా కమిటీ నియామకంపై చర్చించిన నేతలు ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలను గుర్తించి జిల్లా కమిటీలో స్థానం కల్పించాలని నిర్ణయించారు. నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, ముఖ్యనేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అందరి ఆమోదంతో జిల్లా కార్యవర్గాన్ని రూపొందించి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో త్వరలోనే ప్రకటించాలని నిర్ణయించారు. మాజీ మంత్రి, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, చెల్లుబోయిన వేణు, వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, పెట్టా శ్రీనివాస్, సిరిపురపు శ్రీనివాసరావు, అప్పన్నదొర, మార్గాని గంగాధర్, మట్టపర్తి మురళీకృష్ణ, సీహెచ్ రామకృష్ణ, ఎస్.నూకరాజు, అబ్దుల్‌బషీరుద్దీన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, సుదర్శన్‌బాబు, జి.వి.రమణ, రావు చిన్నారావు, వట్టికూటి రాజశేఖరం, నక్కా రాజబాబు, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పచ్చచొక్కాల జేబులు నింపేందుకే ఇసుక విధానం
కోటగుమ్మం(రాజమండ్రి) : పచ్చ చొక్కాల జేబులు నింపేందుకేనన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక విధానం ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షడు, వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. మంగళవారం రాత్రి రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామి నాయుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు, రాజమండ్రి రూరల్ కో-ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, కడియం సొసైటీ అధ్యక్షుడు గిరజాల బాబు సబ్ కలెక్టర్ వి.విజయ రామరాజును కలిసి జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాలని ఫిర్యాదు చేశారు. జనవరి 30న వేమగిరి ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు లారీలను వైఎస్సార్ సీపీ నాయకుడు గిరజాల బాబు పట్టి అప్పగించినప్పటికీ వాటి పై విచారణ లేకుండా ఏకపక్షంగా వేబిల్లులు సక్రమంగా ఉన్నాయని లారీలను వదిలివేశారని తెలిపారు. దోపిడీదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. పైగా ఫిర్యాదు చేసిన వారిపైనే అక్రమంగా కేసు బనాయించారని విమర్శించారు. ఈ ఘటనపై తహశీల్దార్ సక్రమంగా చర్యలు తీసుకోలేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇసుక విధానం లోప భూయిష్టంగా ఉందని విమర్శించారు. దీని వల్ల ఇసుక మాఫియా పెరిగిపోయి పచ్చ చొక్కాల కు ఆదాయ వనరుగా మారిందని ధ్వజమెత్తారు. గతంలో యూనిట్ ధర రూ.1800లకు లభించేందని ప్రస్తుతం రూ.8 వేలు వరకు ధర పలుకుతుందని పేర్కొన్నారు. దళారుల బాగుకోసం ఈ విధానం ఉందన్నారు. వినియోగదారుడు దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలను అడ్డుపెట్టుకొని అన్యాయంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని వివరించారు. గతంలో గ్రామ పంచాయితీలకు ఇసుకపై 50 శాతం ఆదాయం లభించేదని ప్రస్తుతం 15 శాతం ఇవ్వడం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం రూ.1200 కోట్ల వరకూ ఇసుక మాఫీ అక్రమ రవాణా చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఇసుక మాఫియాపై శాసన మండలిలో లేవనెత్తామని, మంత్రి పీతల సుజాత ఇసుక అమ్మకాలు సక్రమంగా జరుగుతున్నాయని వివరణ ఇచ్చారని, ప్రస్తుతం గోపాలపురంలో రూ.3 కోట్లు వరకు ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు విజిలెన్స్ అధికారులు ధ్రువీకరించారని దీనిపై మంత్రి పీతల సుజాత వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఇసుక మాఫియాను అరికట్టి పారదర్శకంగా ఇసుక అమ్మకాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
వచ్చే నెల 6,7 తేదీల్లో తణుకులో వైఎస్ జగన్ దీక్ష
తణుకు : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చేనెల 6, 7 తేదీల్లో తణుకులో నిరాహార దీక్ష చేపడతారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.విజయసాయిరెడ్డి తెలిపారు. దీక్షకు అనువైన ప్రదేశాలను పార్టీ నేతలతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో దీక్ష సన్నాహాలపై సమీక్షించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాయిదుర్గా ప్రసాదరాజు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రౌతు సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
జక్కంపూడి రాజా నిశ్చితార్థ సందడి
ద్రాక్షారామ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా వివాహ నిశ్చితార్థ వేడుక ద్రాక్షారామలో ఆదివారం ఘనంగా జరిగింది. ద్రాక్షారామకు చెందిన లిటిల్రోజ్ విద్యాసంస్థల అధినేత గంధం నారాయణరావు, అన్నపూర్ణ దంపతుల ఏకైక కుమార్తె రాజీతో జక్కంపూడి రాజా వివాహ నిశ్చితార్థ వేడుక లిటిల్ రోజ్ డిగ్రీ కళాశాల ఆవరణంలో జరిగింది. కుమారుడు రాజాకు జక్కంపూడి విజయలక్ష్మి స్వీట్ తినిపించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, వరుపుల సుబ్బారావు, స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు, రాజమండ్రి మేయర్ రజనీశేషసాయి, చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, జక్కంపూడి చిన్ని, వైఎస్సార్ సీపీ యువ జన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత బాబు, కొండేటి చిట్టి బాబు, మాజీ మంత్రులు కొత్తపల్లి సుబ్బారాయుడు, బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు వంగా గీత, కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎంపీలు గిరిజాల స్వామినాయుడు, హర్షకుమార్, పలు పార్టీల నాయకులు పాల్గొని ఆశీర్వదించారు. వర్ధమాన సినీ హీరో సందీప్ కిషన్ ఈ వేడుకలో పాల్గొని హల్చల్ చేశారు.