వచ్చే నెల 6,7 తేదీల్లో తణుకులో వైఎస్ జగన్ దీక్ష
తణుకు : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చేనెల 6, 7 తేదీల్లో తణుకులో నిరాహార దీక్ష చేపడతారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.విజయసాయిరెడ్డి తెలిపారు. దీక్షకు అనువైన ప్రదేశాలను పార్టీ నేతలతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో దీక్ష సన్నాహాలపై సమీక్షించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాయిదుర్గా ప్రసాదరాజు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రౌతు సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.