అక్రమ మైనింగ్‌పై ప్రత్యేక నిఘా: కలెక్టర్ విజయమోహన్ | Special surveillance of illegal mining: Collector vijayamohan | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌పై ప్రత్యేక నిఘా: కలెక్టర్ విజయమోహన్

Published Wed, Nov 26 2014 8:56 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Special surveillance of illegal mining: Collector vijayamohan

కర్నూలు: అక్రమ మైనింగ్‌ను నియంత్రించేందుకు నిఘాను పటిష్టం చేస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ్‌మోహన్ తెలిపారు. 10 చెక్‌పోస్ట్‌లు, నియంత్రణా కమిటీలతో పాటు ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నుంచి ఇసుక రీచ్‌లు డ్వాక్రా మహిళాసంఘాల ఆధీనంలో ఉంటాయని విజయ్‌మోహన్ వివరించారు.

అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఇకపై మీ సేవా ద్వారా ఇసుక కోనుగోలు చేయాలని విజయ్‌మోహన్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement