మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్: చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ఉంటుందని చెబుతున్న సర్కారు ఈసారి ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రం నిరాశపరిచింది. తాజాగా రెవెన్యూశాఖ ప్రకటించిన వీఆర్వో, వీఆర్‌ఏ.. ఏపీపీఎస్సీ ప్రకటించిన పంచాయతీరాజ్ కార్యదర్శుల నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు పోస్టులు కేటాయించలేదు. అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ నియామకాల్లో క్రీడాకారులకు 2 శాతం కోటా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రి తం ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా నోటిఫికేషన్ ప్రకటించిన శాఖలు ఈ ఆదేశాలు పట్టించుకోలేదు. వీఆర్వో, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్‌లో వికలాం గులకు, మాజీ సైనికోద్యోగులకు రిజర్వేషన్ ప్రకటిం చాయి. కానీ క్రీడాకారులకు రిజర్వేషన్ ప్రకటించకపోవడం శోచనీయం. జిల్లావ్యాప్తంగా వీఆర్వో, వీఆర్‌ఏ 136 పోస్టులు, పంచాయతీ కార్యదర్శి 241 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టుల్లో రెండు శాతం క్రీడాకారుల కోటా అమలు కాకపోవడంతో 8 పోస్టులు నష్టపోతున్నారు. డెరైక్ట్ నియామకాల్లో రెండు శాతం క్రీడాకారుల రిజర్వేషను వర్తింపజేయడంలో అధికారులు నిబంధనలను సవరించాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోలేదు. జిల్లాలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాకారులు దాదాపు 2వేలకు పైగా ఉంటారు. వీరందరూ కూడా ఉద్యోగ నియామకానికి దరఖాస్తు చేసుకోవడం లేదు. ఉత్తర్వులు వచ్చి ఏడాది అయినా అధికారులు సవరించకపోవడంతో ఆటల్లో నైపుణ్యం ఉన్న నిరుద్యోగులకు శాపంగా పరిణమించింది.
విషయం : స్పోర్ట్స్ కోటా లేకపోవడం
పోస్టులు : వీఆర్వో 53, వీఆర్‌ఏ 83, పంచాయతీ కార్యదర్శి 241..
వికలాంగుల కోటా(2 శాతం) : వీఆర్వో 1, వీఆర్‌ఏ 2, కార్యదర్శి 5 పోస్టులు
జిల్లాలో అంతర్జాతీయ క్రీడాకారులు : 30 మందికిపైగా..
జాతీయస్థాయి.. : 100 మందికిపైగా..
రాష్ట్రస్థాయి.. : 2 వేలకుపైగా..
ఏమి చేయాలి : {పభుత్వం క్రీడాకారులకు కోటా కేటాయించాలి..
అధికారుల వ్యవహారం సరికాదు..
కష్టపడి చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు అధికారుల నిర్లక్ష్యం శాపమైంది. ఉన్నత హోదాలో ఉన్న వారు ఈ విధం గా వ్యవహరించడం సరికాదు.
- అరవింద్,హ్యండ్‌బాల్
జాతీయస్థాయి క్రీడాకారుడు, మంచిర్యాల
రిజర్వేషన్ అమలు చేయాలి..
అన్ని వర్గాలకు రిజర్వేషన్ ప్రకటించిన అధికారులకు క్రీడాకారులకు రిజర్వేషన్ గుర్తుండకపోవడం శోచనీయం. వీఆర్‌ఏ, వీఆర్వో, కార్యదర్శి నియామకాల్లో క్రీడాకారుల రిజర్వేషన్ అమలు చేయాలి.
- మానస, ఫుట్‌బాల్ క్రీడాకారిణి, లక్సెట్టిపేట
క్రీడాకారులకు చేయిచ్చారు!
Published Tue, Jan 14 2014 5:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement