నెల్లూరులో జాతీయ రహదారిపై..
నెల్లూరు(వీఆర్సీసెంటర్), నాయుడుపేటటౌన్: పట్టణానికి చెందిన ముస్లిం యువత 300 మంది వలస కూలీలకు బుధవారం ఆహారం అందించారు. ఆడిటర్ పఠాన్ అమీర్‌ఖాన్ సారథ్యంలో పఠాన్, షేక్ అరాఫత్, అర్షద్, ఫైజుల్లా, సయ్యద్ మస్తాన్ భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు కార్మికులకు ఆహారం అందించారు.
స్వస్థలాలకు వెళుతున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు జనార్దనరెడ్డికాలనీకి చెందిన యువకులు సుబ్రహ్మణ్యం, సత్తార్, శ్రీను, ఉమామహేశ్వరరావు, సురేష్ అనే యువకులు పెన్నాబ్రిడ్జీ వద్ద బుధవారం ఆహార పొట్లాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment