
సీఎం కిరణ్ అహంకారి:శ్రీధర్ బాబు
మెదక్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కిరణ్ ను అహంకారిగా అభివర్ణించారు. దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడిన శ్రీధర్ బాబు తన మంత్రి పదవి తొలగించడం పూర్తిగా అనైతికమని పేర్కొన్నారు. ఈ ఘటన టీ.నేతలందర్నీ కించపరిచే చర్యగా ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ముందుకెళుతున్న తరుణంలో శాసన సభా వ్యవహారాల శాఖ నుంచి తొలగించడానికి కారణమేమిటని నిలదీశారు.
తెలంగాణ విషయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గతంలో చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఇప్పుడా నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత లేదా? అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.