హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తుగడతో శ్రీధర్ బాబు తెలంగాణలో లీడర్గా ఎదిగారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ శ్రీధర్ బాబును తెలంగాణలో ఫోకస్ చేసేందుకే శాఖ మార్పు జరిగిందన్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో దామోదర రాజనర్సింహ, జానారెడ్డిలే ఫోకస్ అవుతున్నారన్నారు.
మూడేళ్లుగా సీఎంకు సన్నిహితంగా ఉన్నందుకే శ్రీధర్ బాబుకు సీఎం పదోన్నతి కల్పించారని విష్ణు వ్యాఖ్యానించారు. ఈ వాస్తవాన్ని తెలంగాణ నేతలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. కాగా శాఖ మార్పుపై అసంతృప్తిగా ఉన్న శ్రీధర్ బాబు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.