
సాక్షి, తిరుపతి: తిరుమలలో అంగరంగ వైభవంగా సాగుతోన్న శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలు చివరిదశకు చేరుకున్నాయి. గడచిన ఏడు రోజులుగా వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేసిన స్వామివారు ఈ రోజు ఉదయం మహారథంపై ఊరేగారు. రాత్రి జరిగే అశ్వవాహన సేవతో స్వామివారి సేవలు పరిసమాప్తం కానున్నాయి. అశ్వ వాహన సేవలో దుష్ట శిక్షకునిగా కల్కి అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఈ వాహనంపై స్వామి వారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో, విశేష తిరు ఆభరణాలతో అలంకారమై మాడవీధుల్లో ఊరేగుతారు. కలియుగాంతంలో దుష్టశిక్షణ... శిష్టరక్షణ చేసి ధర్మాన్ని పునఃప్రతిష్ట చేసే కల్కిమూర్తి రూపం నిజంగా అపురూపం. బ్రహ్మోత్సవాలలో అశ్వవాహన సేవతో స్వామి వారి వాహన సేవలు ముగియనున్నాయి.
తిరుమల బ్రహ్మోత్సవాలు: మహారథంపై శ్రీవారి వైభవం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment