ఏపీలో పోలింగ్ ఇలా...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రేపు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రేపు ఉదయం 8 గంటలకు సచివాలయంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. పోలింగ్‌లో అనుసరించాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. ఉదయం 10 గంటలకు వీరంతా పోలింగ్‌లో పాల్గొంటారు. పోలింగ్‌లో ఎన్డీఏ తరపున పోలింగ్ ఏజెంట్‌గా కాల్వ శ్రీనివాసులు వ్యహరించనున్నారు.
మరోవైపు స్టేట్ గెస్ట్‌హౌస్‌లో రేపు ఉదయం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భేటీకానున్నారు. సమావేశం తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పోలింగ్‌కు వెళ్లనున్నారు.