నాలుగో తేదీ రాత్రి ఏం జరిగింది? | star hotel employee gang-raped in vizag | Sakshi
Sakshi News home page

పిలవగానే.. అర్ధరాత్రి వెళ్లడం ఏమిటి?

Published Sat, Jun 10 2017 9:06 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

నాలుగో తేదీ రాత్రి ఏం జరిగింది? - Sakshi

నాలుగో తేదీ రాత్రి ఏం జరిగింది?

►   కలకలం రేపుతున్న సామూహిక లైంగిక దాడి కేసు
►  నాలుగు రోజుల తర్వాత యువతి ఫిర్యాదు 
►  పరిచయస్తుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణ
►  పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు? 
►  అతనితోపాటు హోటల్‌ సిబ్బందినీ విచారిస్తున్న పోలీసులు


‘పరిచయస్తుడు కావడం.. మొహమాట పెట్టడంతో అతడితో వెళ్లాను.. పైగా కలిసి మద్యం సేవించాను.. ఆ మత్తులో ఉన్న నాపై లైంగిక దాడికి పాల్పడ్డార’ని నాలుగు రోజుల తర్వాత ఓ యువతి చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది.

ఎంత పరిచయస్తుడైనా పిలవగానే.. అర్ధరాత్రి వెళ్లడం ఏమిటి?.. వెళ్లినా మద్యం సేవించి రాత్రితెల్లవార్లు ఉండిపోవడం.. లైంగిక దాడికి పాల్పడినవారెందరన్న విషయంలో స్పష్టత లేకపోవడం పోలీసులను తికమకపెడుతోంది.

దాంతో ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తితోపాటు ఇంకెవరు ఉన్నారు.. వారు ఇద్దరా.. ముగ్గురా.. అసలు ఆ రాత్రి ఏం జరిగింది?.. అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

తనపై లైంగిక దాడి జరిగిందని బీచ్‌రోడ్డులోని ఓ స్టార్‌ హోటల్లో పని చేస్తున్న యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతానికి ఒక వ్యక్తిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
 
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): నగరంలో పేరొందిన ఓ స్టార్‌ హోటల్‌లో పనిచేస్తున్న ఓ యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగిందని  చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ యువతి మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించడం విశేషం. ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం వరకు ఓ స్టార్‌ హోటల్‌లో పని చేసి మానేసిన శ్రీధర్‌ అనే వ్యక్తి ఈనెల 4న  అదే హోటల్లో దిగాడు. అక్కడ పని చేస్తున్న  యువతితో అతనికి అప్పుడే పరిచయం ఉంది. నాలుగో తేదీ రాత్రి విధులు ముగించుకుని ఇంటికెళుతున్న ఆ యువతిని పాత పరిచయంతో ఒప్పించి తిరగి హోటల్‌కు తీసుకొచ్చాడు.

హోటల్‌ వెనుక ఉన్న బీచ్‌ ప్రాంతంలోకి ఇద్దరూ వెళ్లి తెల్లవారుజాము వరకు మద్యం సేవించారు. మద్యం మత్తులో తూలుతున్న ఆమెను మరుసటి రోజు ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది గమనించి ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టారు. అయితే ఆమె పరిస్థితి బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చాలాసేపటికి మత్తు వీడిన ఆ యువతి తనపై రాత్రి హోటల్‌లో సామూహిక లైంగిక దాడి జరిగిందని తల్లిదండ్రులకు చెప్పింది.దాంతో వారు, సహచర సిబ్బంది ఆ విషయాన్ని బెంగళూరులో ఉన్న హోటల్‌  ఉన్నతాధికారుల దృష్టికి  తీసుకు వెళ్లారు. ఆ తరువాత 8వ తేదీ(శుక్రవారం) రాత్రి మూడో పట్టణ పోలీసులు ఫిర్యాదు చేశారు.

అదుపులో శ్రీధర్‌: యువతి తన ఫిర్యాదులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న శ్రీధర్‌ను పోలీసులు అదపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని వారు అధికారికంగా చెప్పడంలేదు. నాలుగో తేదీ రాత్రి ఏం జరిగింది. శ్రీధర్‌తోపాటు ఎందరున్నారు? అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

నాలుగో తేదీన గది తీసుకున్న శ్రీధర్‌ అక్కడ ఏం చేశాడు. ఎన్ని గంటలకు బయటకు వెళ్లాడు. మళ్లీ ఎప్పుడు తిరిగొచ్చాడు. అతడితోపాటు ఇంకెవరు ఉన్నారు అన్న విషయాలను ఆరా తీస్తున్నారు. ఆ పక్క గదుల్లో ఎవరున్నారన్న దానిపైనా దృష్టి సారించారు. ఆ రాత్రి శ్రీధర్‌ గది ఉన్న ప్లోర్‌లో సర్వీసు చేసిన సిబ్బందిని కూడా విచారించనున్నట్లు తెలిసింది.

లైంగిక దాడిలో శ్రీధర్‌తోపాటు ముగ్గురు!
శ్రీధర్‌తో సహా నలుగురు లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీధర్‌తోపాటు విజయవాడకు చెందిన వినయ్‌ అనే వ్యక్తి.. ఇంకో ఇద్దరు నాలుగో తేదీ రాత్రి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం. వినయ్‌ విశాఖ వచ్చిన సందర్భాల్లో అదే హోటల్లో దిగేవాడని అంటున్నారు. ఆ క్రమంలోని గతంలో అక్కడ పని చేసిన శ్రీధర్‌తో పరిచయం పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. వీరిద్దరు కాకుండా దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు ఎవరిన్నది ఇంకా అంతుచిక్కడం లేదు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నా.. శ్రీధర్‌ మాత్రం వారి అదుపులో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement