
రాష్ట్ర విభజన ఆగదు: దివాకరరెడ్డి
రాష్ట్ర విభజన ఆగదని తాను భావిస్తున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే జె.సి.దివాకరరెడ్డి అన్నారు. అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తుందని కూడా అనుకోవడం లేదని చెప్పారు. విభజనపై చర్చలకు ఆస్కారం లేదని ఆయన పేర్కొన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తున్న ఎన్జీవోలు సమ్మె విరమించాలని దివాకరరెడ్డి సూచించారు.
రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పార్టీ వస్తుందో రాదో తెలియదని వ్యాఖ్యానించారు. తనకు రాజకీయంగా రిటైర్డవడం మినహా మరో మార్గం లేదని ఆయన చెప్పారు.