ఏపీలో మూడు కేన్సర్ ఆస్పత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, నెల్లూరు, కర్నూలు నగరాల్లో కొత్తగా మూడు కేన్సర్ ఆస్ప్రతులను నెలకొల్పనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ విషయం చెప్పారు. వీటితో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఆధునిక సదుపాయాలు కల్పిస్తామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని చెప్పారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగంపై చాలా ప్రభావం పడిందని ఆయన అన్నారు. పెద్దపెద్ద ఆస్పత్రులన్నీ.. ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేటు రంగంలో గానీ అన్నీ గత మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలోనే అభివృద్ధి చెందాయన్నారు. మొత్తం 13 జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు.