బాబుగారి బుడ్డీ కానుక | Story on AP CM Chandrababu naidu's liquor policy | Sakshi
Sakshi News home page

బాబుగారి బుడ్డీ కానుక

Published Fri, Oct 31 2014 1:32 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

బాబుగారి బుడ్డీ కానుక - Sakshi

బాబుగారి బుడ్డీ కానుక

సారా తాగినోడు సాంబమూర్తి కొడుకు
బ్రాందీ తాగినోడు బ్రహ్మదేవుని కొడుకు
విస్కీ తాగినోడు విష్ణు మూర్తి కొడుకు
ఏమీ తాగనోడు ....
అంటూ ఓ ప్రముఖ సినీ మాటల రచయిత ఓ సందర్భంలో పేర్కొనాడు. ఈ నాలుగు వ్యాఖ్యలు అక్షర సత్యం.  అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్ర ప్రజలను మందుబాబులుగా తీర్చిదిద్దాలని ఉద్దేశంలో ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తా, బెల్ట్ షాపుల తాట తీస్తానంటూ.... ఎన్నికల సమయంలో ఆయన లెక్కలేనన్ని హామీలు గుప్పించారు. అయితే గద్దెనెక్కిన ఆయన ... ఇచ్చిన వాగ్దానాలు తుంగలోకి తొక్కేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయినా రుణాలు మాఫీకి అదిగో...ఇదిగో అంటూ కాకి లెక్కలు...మోకాలుకు బోడిగుండుకు లంకె పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఏ రైతుకు రుణాలు మాఫీ కాలేదు. మరోవైపు బ్యాంకులు కూడా రుణమాఫీ సాధ్యం కాదంటూ చెబుతున్నాయి కూడా.  తాజాగా నారావారి కన్ను ...బెల్ట్ షాపులపై పడింది.

అధికారంలో రాగానే బెల్ట్ తీస్తామన్న ఆయన... తాజాగా ఉన్నవాటిని రద్దు చేయకుండా ఇంకా పెంచాలంటే ఆదేశాలు జారీ చేయటం విశేషం.  రాష్ట్రంలో ఇప్పటికే 12 డిస్టలరీలు ఉండగా వాటిని ఇంకా పెంచాలని చెప్పటంతో పాటు, పనిలో పనిగా మద్యం తయారీ ఉత్పత్తిని మరింత పెంచాలంటూ సెలవించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నా...బాబు గారు మాత్రం ఐ డోంట్ కేర్ అంటున్నారు. అసలే రాష్ట్ర విభజనతో నష్టపోయాం, ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని ఇటీవల ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు బంగారు బాతులాంటి...మద్యం తయారీ, విక్రయాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement