
చదువుకున్న దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గాజువాక వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షురాలు మేడిశెట్టి నాగమణి వైఎస్ జగన్‌ను కోరింది. దివంగత నేత వైఎస్ హయాంలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకున్నారని, ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేకుండా పోయిందని వాపోయింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాకా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరింది.