అనంతపురం సీటీ/ఎస్కేయూ, న్యూస్‌లైన్ :
‘రాష్ట్రాన్ని విభజిస్తూ 2009 డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగానే మొట్టమొదటిసారి సమైక్య ఉ ద్యమానికి ఊపిరి పోసింది విద్యార్థులే.. ఆ స్ఫూర్తితోనే ప్రస్తుతం ఉద్యమ బాట పట్టాం’. ‘ప్రజా స్వామ్యాన్ని శాసిస్తున్న రాజకీయ పార్టీల నిర్ణయాలను తిరగరాసి.. స్వార్థ రాజకీయాలను ఎండగట్టాల్సిన ప్రథమ బాధ్యత విద్యార్థులపై ఉం ది’ అని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపునిచ్చారు. వర్సిటీలో సోమవారం నిర్వహించిన ‘ఎస్కే యూ సమైక్య భేరి’లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ముందుగా స మైక్య ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలో కొందరు నేతలు తీసుకుంటున్న స్వార్థ రాజకీయ నిర్ణయాల ద్వారా విద్యార్థులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాజకీ య పార్టీల నిర్ణయాలను తిరగరాసే నిర్ణయాత్మక శక్తిగా విద్యార్థులు అవతరించాలన్నారు. విభజనతో ఎక్కు వ శాతం నష్టపోయేది విద్యార్థులే న న్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల పరిధిలో 17 వర్శిటీలు ఉన్నాయని, ఏటా రూ.600 కోట్ల నిధులు అవసరమవుతాయన్నారు. విభజన జరిగి తే హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలోకి వెళ్తే నిధుల మంజూరులో కోత ఏర్పడుతుందన్నారు. వర్శిటీలు బలహీన పడుతాయన్నారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాలకు నిధులు ప్రశ్నార్థకమవుతాయన్నారు. ఫలితంగా ఇంజినీరింగ్ విద్యార్థుల భవిత అంధకారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిఏటా రాష్ట్ర ఆదాయం రూ.80 వేల కోట్లైతే కేవలం హైదరాబాద్ నుంచే రూ.40 వేల కోట్లు లభిస్తుండగా మిగిలిన జిల్లాల నుంచి రూ.40 వేలు వస్తోందన్నారు. హైదరాబాద్ తమదని తెలంగాణ వేర్పాటువాదులు వాదించడం సిగ్గుచేట న్నా రు. ప్రస్తుతం ప్రపంచ దే శాలు గుర్తించే స్థాయిలో హైదరాబాద్ ఖ్యాతి గడిం చిందన్నారు.
సమైక్య ఉద్యమంలో వి ద్యార్థులు శాంతియుత ఆందోళనలు నిర్వహించాలని సూచించారు. రాజ కీయ నాయకులు చేయాల్సిన ఉద్యమాన్ని ఏడు లక్షల మంది ఉద్యోగులు త మ జీతాలను త్యాగం చేసి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. సమైక్య ఉద్యమాన్ని 2014 వరకూ నడిపిస్తామని ఆపై ఉద్యమానికి ఊపిరి పోయాల్సిన బా ధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే సమర్థ నాయకునికే 2014 ఎన్నికల్లో పట్టం కట్టల న్నారు. ఏపీ ఎన్జీఓ సంఘం ప్రధాన కా ర్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా సంయుక్త జేఏసీ చైర్మన్ హేమసాగర్, వివిధ జేఏసీల నాయకులు విశ్వనాథ్‌రెడ్డి, దేవరాజ్, నర్సయ్య, నరసింహులు, పుల్లారెడ్డి, చిరంజీవిరెడ్డి, రమణారెడ్డి, రామసుబ్బారావ్, అషఫ్‌అ్రలి, సంపత్‌కుమా ర్, గిరిధర్‌రావ్, రాజేశ్వరరావ్, సదాశివరెడ్డి, లింగారెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.
సమైక్య ఉద్యమానికి విద్యార్థులే స్ఫూర్తి
Published Tue, Sep 24 2013 3:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement