అనంత కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
Published Mon, Jul 24 2017 1:45 PM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM
- ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
అనంతపురం: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా కలక్టరేట్ వద్ద సోమవారం ఉదయం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
దీంతో పోలీసులు వారిపై లాఠీ ఝులింపించారు. దీంతో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో తొమ్మిదో తరగతి విద్యార్థి ఎర్రిస్వామి తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement