వివాహేతర సంబంధమే..ఉసురుతీసిందా? | suicide attempted | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధమే..ఉసురుతీసిందా?

Published Sun, Feb 2 2014 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

suicide attempted

మహాబుబ్‌పల్లి(మహాముత్తారం), న్యూస్‌లైన్ : మహా ముత్తారం మండలం మహబుబ్‌పల్లికి చెందిన జాడి వసంతలక్ష్మీ(28), ఎర్నేని సురేష్(25) శనివారం వేకువజామున హత్యకు గురయ్యూరు. వివాహేతర సంబంధ మే ఈ దారుణానికి కారణమని, మృతురాలి భర్తే వీరిని హతమార్చి ఉంటాడని అనుమానాలు తలెత్తుతున్నా రుు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వసంతలక్ష్మీ(28)- వెంకటేశ్ భార్యాభర్తలు. వీ రికి మూడేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వసంతలక్ష్మీ గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తుండగా, వెంకటేశ్ వ్యవసాయం చేస్తున్నాడు. రెండునెలల క్రితం వసంతలక్ష్మీ గ్రామానికి చెందిన ఎర్నేని సురేష్(25)తో చనువుగా ఉంటుందని వెంకటేశ్ అనుమానించాడు. భా ర్యను నిలదీయగా తనకేపాపం తెలియదని, అతడే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పింది. దీంతో వెంకటేశ్ పో లీసులకు ఫిర్యాదు చేయగా సురేష్ జైలుకెళ్లాడు. ఆ త ర్వాత బెరుుల్‌పై వచ్చిన సురేష్, వసంతలక్ష్మీతో ఎప్పట్లాగే చనువుగా ఉండడం ప్రారంభించాడు. వారం క్రితం పుట్టింటికి వెళ్లిన వసంతలక్ష్మీ శుక్రవారం గ్రామానికి వచ్చింది.
 
 ఉట్లపల్లిలో అక్కబావ దగ్గర  ఉంటున్న సు రేష్ కూడా అదే రోజు గ్రామానికి వచ్చాడు. శనివారం వే కువజామున ఊరి చివర ఓ పెసరకల్లంలో వసంతలక్ష్మీ, సురేష్ శవాలై కనిపించారు. గొడ్డలితో నరికి చంపిన ఆనవాళ్లు కనిపించారుు. వెంకటేశ్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని సీఐ శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశా రు. ఎస్సై నరేశ్‌తో కలసి శనివారం ఆయన సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. విచారణ ప్రారంభించినట్లు చె ప్పారు. హత్యలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై స మాచారం సేకరిస్తున్నామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement