vasantha lakshmi
-
2040 నాటికి నీటి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? కనీసం..
గాలి తర్వాత ప్రాణాధారం నీటిచుక్క. గొంతెండిపోతే నోట్లకట్టలు దాహం తీర్చవు. నీటి చుక్క కోసం... అర్రులు చాచాల్సి వస్తుంది. ధారపోయడానికి చేతిలో డబ్బున్నా సరే... నేలతల్లి కడుపులో చుక్క మంచి నీరుండదు. జాగ్రత్త పడదాం... భవిష్యత్తును కాపాడుకుందామని... దేశాన్ని చైతన్యవంతం చేస్తున్నారు వసంతలక్ష్మి. ‘‘2040 నాటికి నీటి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? భావి తరాల కోసం ఆస్తులు కూడబెడుతున్నాం, బాగా చదివి పెద్ద ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించాలని వాళ్లకు నేర్పిస్తున్నాం. చేతి నిండా డబ్బు ఉండి గొంతు తడుపుకోవడానికి నీటి చుక్క లేని జీవితాలను పిల్లలకు అందిస్తున్నాం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే రాబోయే తరాలు కాదు కదా, మనతరమే నీటి ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు సంపాదనను వ్యసనంలాగ పిల్లల బుర్రల్లోకి ఎక్కించేస్తున్నాం, నీటి వృథాను అరికడదామని మాట మాత్రంగానైనా చెప్తున్నామా?’’ ఇలా సాగుతుంది వసంతలక్ష్మి ప్రసంగం. నీటి సంరక్షణ గురించి పాఠం చెప్తోందామె. నేడు వరల్డ్ వాటర్ డే సందర్భంగా తన నీటి ఉద్యమం వివరాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. జలమే ధనం ‘‘వర్షాలొస్తే రోడ్లు జలమయం, ఎండకాలం మొదలయ్యే నెల నుంచే రోడ్ల మీద నీటి ట్యాంకుల స్వైరవిహారం. ఆ ట్యాంకర్లను చూస్తే డేంజర్ బెల్స్ మోగించుకుంటూ వెళ్తున్నట్లే అనిపించేది. మనిషి భవిష్యత్తు ఎంతటి ప్రమాదంలో పడుతుందోననే దిశలో నా ఆలోచన సాగడంతో అధ్యయనం మొదలుపెట్టాను. గణాంకాలు భయపెట్టాయి. ఇదే ధోరణిలో నీటిని వృథా చేస్తుంటే మన తరమే నీటికోసం అల్లాడే రోజు వస్తుంది. అందుకే జలాన్ని మించిన ధనం మరొకటి లేదని చైతన్యవంతం చేసే పనిలో ఉన్నాను. కశ్మీర్లో మొదలు పెట్టిన ‘జల్ ధన్ యాత్ర’ ఉత్తరాఖండ్, హరియాణా మీదుగా ఢిల్లీకి చేరింది. వరల్డ్ వాటర్ డే (మార్చి 22) పురస్కరించుకుని గుర్గావ్లో 20వ తేదీన అవగాహన సదస్సు నిర్వహించాం. జలగండం! నీటి గురించిన వివరాల్లోకి వెళ్లేకొద్దీ వెన్నులో నుంచి వణుకు పుడుతుంది. మనదేశంలో మనిషి సగటున ఒక రోజుకి వృథా చేసే నీరు పదకొండు గ్యాలన్లుగా ఉంటోంది. జలపొరల్ని చీల్చుకుని మరీ తోడేస్తున్నాం. మహారాష్ట్రలో భూగర్భజలాలు మైనస్‌లోకి వెళ్లిపోయాయి. మూడు వందల అడుగుల వరకు నీటి చుక్క ఆనవాలుకు కూడా అందడం లేదు. తమిళనాడులో ఒకప్పుడు 57 జీవనదులు ప్రవహించేవి. మనిషి భూమి ఆక్రమణ ఆకలికి నదులు కూడా బలయిపోయాయి. ఇప్పుడు ఐదారుకి మించి జీవనదుల్లేవక్కడ. మనకు నీటిని పొదుపు చేయడం, వృథాను అరికట్టడంలో విచక్షణ లేదు. అలాగే పరిశ్రమల వ్యర్థాల కారణంగా నీటి వనరులు కలుషితం కావడం గురించి ఏ మాత్రం ముందుచూపు లేదు. ప్రజల్లో చైతన్యం ఉంటే పరిశ్రమలు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వెనుకాడతామయనేది నా అభిప్రాయం. పరిశ్రమల నిర్వహకులు తాము వాడిన నీటిని శుద్ధి చేసి భూమిలోకి వదలాల్సి ఉండగా, ఆ నియమాలేవీ పాటించకుండా నేలకు రంధ్రాలు చేసి వదిలేస్తున్నారు. దాంతో భూగర్భజలాలు కలుషితమైపోతున్నాయి. పంజాబ్‌లో ఒక రైలును స్థానికులు క్యాన్సర్ రైలని పిలుస్తారు. ఆ రైలులో ప్రయాణించే వాళ్లలో... కలుషిత నీటిని తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడిన వాళ్లు ఢిల్లీకి వైద్యానికి వెళ్లే వాళ్లే ఎక్కువని చెబుతారు. మనదేశంలో నీటి కాలుష్యానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి. ‘ఉదాసీనంగా ఉంటే రాబోయే తరాలు మనల్ని క్షమించవు. మేల్కోండి’ అని ఎలుగెత్తి చెబుతున్నాను’’ అని చెప్పారు సామాజిక కార్యకర్త చీరాల వసంతలక్ష్మి. వాటర్ షెడ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వసంతలక్ష్మి గత ఏడాది ‘వాటర్ వారియర్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ‘జల్ ధన్ యాత్ర’ ద్వారా దేశవ్యాప్తంగా పర్య టించి గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విద్యార్థులు, మహిళలు, రైతులకు గణాంకాలతో సహా నీటి గురించి వివరిస్తున్నారు. సామాజిక ‘స్నేహిత’ చీరాల వసంతలక్ష్మి పుట్టింది ఆంధ్రప్రదేశ్, నెల్లూరు నగరంలో. ‘అమ్మతనానికి అవమానం జరగకూడదు. బిడ్డలందరూ సమానంగా పుడతారు. ఏ బిడ్డా అన్వాంటెడ్ కాదు... కాకూడదు. ఆడపిల్లను వద్దంటే నాకివ్వండి... బతికిస్తాను’... ఈ ‘అమ్మ ఒడి’లో ప్రేమ ఉంది, ‘ఇదిగో ఊయల’... అని పాతికేళ్ల కిందట నగరంలో 27 ఊయలలు పెట్టారు. 87 మంది పిల్లలకు అమ్మ అయ్యారామె. ఆ ఊయలను ప్రభుత్వం చేపట్టింది, తమిళనాడులో జయలలిత ప్రభుత్వమూ అందుకుంది. సమాజంలో తల్లులందరూ తమ పిల్లలను అనారోగ్యాల నుంచి సంరక్షించుకోగలిగిన అవగాహన కలిగి ఉండాలనే ఆశయంతో మొదలైన నా సేవలో ఏదీ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదు. ఒక్కొక్కటిగా వచ్చి చేరుతూ నా బాధ్యతలను పెంచుతూ వచ్చాయి. జపనీస్ ఎన్సెఫలైటిస్ వచ్చినప్పుడు పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించాలంటే రిజిస్టర్ అయిన సంస్థ ఉండాలన్నారు. అలా నా సేవ 1998లో వ్యవస్థీకృతమైంది. స్పెషల్ కిడ్స్ 150 మందిని దత్తత తీసుకున్నాను. వాళ్లతో డీల్ చేయడం కోసం నేను స్పెషల్ బీఈడీ చేసి వాళ్లకు ఎడ్యుకేటర్‌గా మారాను. అలాగే మహిళల సమస్యల గురించి పోరాడే క్రమంలో చట్టాలు తెలుసుకోవడానికి బీఎల్ చదివి... సేవలను ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించాను. కరాటేలో బ్లాక్‌బెల్ట్, రైఫిల్ షూటింగ్లో గోల్డ్ మెడలిస్ట్‌ని కావడంతో బాలికలు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి కాలేజీ విద్యార్థినులు, స్వయం సహాయక బృందాల మహిళలు మొత్తం పదిహేను వేల మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రమాదాల బారిన పడకుండా కొన్ని మెళకువలు నేర్పించాను. అలాగే చనిపోవాలనుకున్న వాళ్లకు ‘స్నేహిత’నయ్యాను. సర్వీస్ అనే ఉద్దేశంతో మొదలు పెట్టలేదు, కానీ ఎక్కడ అవసరం ఉందనిపిస్తే అక్కడ వాలిపోతూ నా ప్రయాణం నీటి సంరక్షణ దిశగా సాగుతోంది. – సీహెచ్. వసంతలక్ష్మి. అడ్వొకేట్, వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అండ్ రీసెర్చ్ సెంటర్ – వాకా మంజులారెడ్డి చదవండి: మళ్లీ పిలిపించే అవసరం రాకుండా చూసుకోండి! బతుకుజీవుడా అని బయటపడ్డా! -
సమాజ స్రవంతిలోకి శివపుత్రులు
శ్మశానం జీవితానికి చివరి వేదిక. అయితే కొందరికది చివరి మజిలీ కాదు, కొన్ని జీవితాలక్కడే మొగ్గ విచ్చుకుంటున్నాయి. కావాలంటే, నెల్లూరు వెళ్లండి. అక్కడ మరు భూమిలోని శివపుత్రులను మార్చిన ఆశయాన్ని చూడండి. ెల్లూరులోని బోడిగారి తోట శ్మశానం... తలదాచుకోవడానికి నీడ, గూడు లేని అనేక జీవితాలకు ఈ శ్మశానమే ఆవాసం. తిండి, నిద్ర ఈ మరుభూమిలోనే. ఈ రుద్రభూమి వందల మంది బిడ్డలకు జన్మభూమిగా మారింది. ఇక్కడి పిల్లలకు నిత్యం శవాలతోనే సావాసం, ఎముకలు, పుర్రెలతో ఆటలు. పుట్టుకతోనే భయం చచ్చిన ఆ చిన్నారులు.. సభ్యసమాజానికి దూరంగా అసాంఘిక కార్యక్రమాలు, రుగ్మతలతో కొట్టుమిట్టాడారు. ఇది ఒకప్పటి సంగతి. ఇప్పుడు వసంతలక్ష్మి రూపంలో అక్కడ మానవత్వం చిగురించింది. దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న చిన్నారుల భవిష్యత్తుకు క్యాప్ (సిఎపిపి- చైల్డ్ అండ్ పోలీస్ ప్రాజెక్ట్) రూపంలో బంగారు బాట ఏర్పడింది. వసంతలక్ష్మి సంప్రదాయ కుటుంబానికి చెందిన మహిళ. ఈ ప్రయత్నం చేయడానికి దారి తీసిన పరిస్థితులను ఆమె వివరిస్తూ... ‘‘మా అమ్మ మరణం నన్ను తీవ్రంగా కలచి వేసింది. సంప్రదాయానికి విరుద్ధంగా అమ్మ పార్థివదేహంతోపాటు అంతిమయాత్రలో పాల్గొన్నాను. అప్పుడు శ్మశానంలో కనిపించిన దృశ్యాలు నన్ను కదిలించాయి. ఇంటికి వచ్చినా కూడా అమ్మ మరణం కన్నా ఎక్కువగా ఆ సన్నివేశాలే గుర్తుకురాసాగాయి. దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తూ చదువు, సంస్కారాలకు దూరంగా శవాల మధ్య బతుకు వెళ్లదీస్తున్న వారి జీవితాలు కలచివేశాయి. దీనికి తోడు మద్యం, మత్తు పదార్థాల సేవనం లాంటి దురలవాట్లు కూడా. వాళ్లను అలాగే వదిలేస్తే పసిమొగ్గలు అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉందని భయం వేసింది’’ అన్నారామె. క్యాప్ ప్రారంభమైందిలా.. ఆ సంఘటన తర్వాత తరచూ శ్మశానానికి వెళ్లి అక్కడ పిల్లలతో మాట్లాడడం ప్రారంభించారు వసంతలక్ష్మి. ఆ పిల్లలు ఆమెను గ్రహాంతర వాసులను చూసినట్లు వింతగా చూసి పరుగులు తీసేవారు. వారిని మంచి చేసుకోవడం కోసం ఆమె చాక్లెట్లు, బొమ్మలు ఇచ్చేవారు. వారి కోసం వైద్యశిబిరాలు ప్రారంభించారు. మంచి మాటలు చెప్పడం, మెడికల్ క్యాంప్‌లు నిర్వహించడంతో పిల్లలు, వారి తల్లిదండ్రులకు వసంతలక్ష్మిపై నమ్మకం కలిగింది. అక్కడి మహిళలకు పొదుపు చేయడం నేర్పించారు. బృందాలను ఏర్పాటు చేసి సంఘటితంగా పొదుపు పథకాన్ని కొనసాగించేటట్లు తర్ఫీదునిచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తయితే అక్కడి అసాంఘిక వాతావరణాన్ని అదుపు చేయడం వసంతలక్ష్మికి శక్తికి మించిన పనైంది. తరుణోపాయం సూచించవలసిందిగా ఆమె పోలీసులను సంప్రదించారు. ఆమె ప్రయత్నానికి అప్పటి ఎస్పీ రమణకుమార్ స్పందించారు. స్వచ్ఛందసేవా సంస్థలు, పోలీసు శాఖ సంయుక్తంగా పని ప్రారంభించాయి. వంద మందికిపైగా ఉన్న బడి ఈడు పిల్లల్లో మార్పు తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించారు. 2011 అక్టోబర్ 3న చైల్డ్ అండ్ పోలీసు ప్రాజెక్టు(క్యాప్) ఆవిర్భవించింది. సాధారణ బాల్యానికై అసాధారణ సాధన... ‘‘క్యాప్ ప్రారంభమైన తర్వాత జిల్లా పోలీసు యంత్రాంగం, మా చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది ఆ పిల్లలను రోజూ బస్సుల్లో తిప్పడం, సినిమాలకు తీసుకెళ్లడం, కలసి ఆటలాడడంతో పిల్లల్లో మార్పు వచ్చింది. ఈ క్రమంలో పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, గోళ్లు కత్తిరించడం, పళ్లు తోముకోవడం, శుభ్రమైన బట్టలు ధరించడం, జుట్టు కత్తిరించుకోవడం లాంటి పనులు నేర్చుకున్నారు’’ అన్నారు వసంతలక్ష్మి. పరిసరాల మార్పు! స్థానిక పోలీసు హాస్టల్లో ఈ పిల్లలకు ఉచిత వసతి, భోజనం, పోలీసుశాఖ నిర్వహిస్తున్న వ్యాస్ పోలీసు వెల్ఫేర్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభించారు. ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు జిల్లా పోలీసులు ఒక నెల వేతనాన్ని క్యాప్‌కు విరాళంగా అందజేశారు. ఆ తర్వాత కూడా అవసరమైన సందర్భాలలో చేయూతనిస్తున్నారు. అప్పటి డీజీపీ ప్రోత్సాహంతో పలువురు దాతలు ముందుకొచ్చారు. ఈ చిన్నారులకు చదువుతోపాటు ఆటలు, నాట్యం వంటి వాటిల్లోనూ శిక్షణనిస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతిభకు తగ్గ తరగతులు చదువుతున్నారు. ‘బాగా చదువు కుని పోలీసు అధికారులు, కలెక్టర్, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతామ’ని చెబుతున్నారీ పిల్లలు. ఈ ‘శివపుత్రులు’ ఆరోగ్యకర వాతావరణంలో పెరిగిన సాధారణ పిల్లల్లా మారిన తీరు చాలామందికి ఒ నమూనా అంటే అతిశయోక్తి కాదు. - బిజువేముల రమణారెడ్డి, సాక్షి ప్రతినిధి, నెల్లూరు అంతకంటే ఆనందమేముంది! ‘‘మొదట బూతులు తిట్టిన పిల్లలు నన్ను ‘అమ్మా’ అని పిలుస్తున్నారు. చిత్తు కాగితాలు ఏరుకుంటూ, పాచి పనులు చేసుకునే వారి తల్లితండ్రుల్లో నమ్మకం కలిగించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. పోలీసుల సహకారం తో ఈ పిల్లల జీవితాలను మార్చగలిగాను. పిల్లల్లో పరివర్తన రావడం సంతోషంగా ఉంది. వీళ్లను చూస్తూ నా కష్టాన్ని మర్చిపోతున్నాను. వీళ్లను ప్రయోజకులుగా చేయడమే ఇప్పుడు నా కర్తవ్యం.’’ - వసంతలక్ష్మి, చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు -
జోరుగా ఇసుక అక్రమ రవాణా
చిన్నకోడూరు, న్యూస్‌లైన్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వాగు నుంచి అక్రమార్కులు ఇసుకను తరలిస్తూ మండల పరిధిలో డంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి సిద్దిపేటకు ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుక సుమారు రూ. 2500, ట్రాలీ ఆటో ఇసుక రూ.1200 నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ వ్యాపారంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకులు భాగస్వాములుగా ఉండడంతో అధికారులు మొక్కుబడి దాడులు, నామమాత్రపు జరిమానాలతో సరిపుచ్చుతున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట నుంచి ఇసుకను మండలంలోని అల్లీపూర్, చిన్నకోడూరు మీదుగా సిద్దిపేటకు, అదేవిధంగా సిరిసిల్ల వాగు నుంచి మండలంలోని జక్కాపూర్ మీదుగా సిద్దిపేటకు ప్రతి రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోల్లో ఇసుక అక్రమ రవాణా అవుతోంది. అధికారులు మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆందోళనలో రైతులు ఇసుక అక్రమ రవాణా అరికట్టకపోతే భూగర్భ జలాలు అంతరించిపోతాయన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. దీంతో ఉన్నతాధికారుల వత్తిడి మేరకు అధికారులు దాడులు నిర్వహించి నామమాత్రపు కేసులు నమోదు చేస్తున్నారు. ఇతర సందర్భాల్లో అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. భారీగా డంప్‌లు మండలంలోని అల్లీపూర్, జక్కాపూర్లలో రహస్య ప్రాంతాల్లో వ్యాపారులు పెద్ద ఎత్తున ఇసుకను డంప్ చేస్తున్నారు. సిరిసిల్ల, ఇల్లంతకుంటల నుంచి తెచ్చిన ఇసుకను రాత్రికి రాత్రే ట్రాక్టర్లు, ఆటోల సాయంతో సిద్దిపేటకు తరలిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో డంప్ చేస్తూ అధికారులకు చిక్కకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇటీవల అధికారులు ఇసుక రవాణాను అడ్డుకోవడంతో కొద్ది రోజులు రవాణా ఆగిపోయింది. తిరిగి కొందరి అండదండలతో తిరిగి యథావిధిగా కొనసాగుతుంది. చర్యలు తీసుకుంటాం తన దృష్టికి వచ్చిన వాటి అన్నింటిపై చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్దార్ వసంతలక్ష్మి అన్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధిస్తున్నట్లు ఆమె వివరించారు. ఇకపై రాత్రిళ్లు కూడా నిఘా ఏర్పాటు చేస్తామని తహశీల్దార్ తెలిపారు. -
వివాహేతర సంబంధమే..ఉసురుతీసిందా?
మహాబుబ్‌పల్లి(మహాముత్తారం), న్యూస్‌లైన్ : మహా ముత్తారం మండలం మహబుబ్‌పల్లికి చెందిన జాడి వసంతలక్ష్మీ(28), ఎర్నేని సురేష్(25) శనివారం వేకువజామున హత్యకు గురయ్యూరు. వివాహేతర సంబంధ మే ఈ దారుణానికి కారణమని, మృతురాలి భర్తే వీరిని హతమార్చి ఉంటాడని అనుమానాలు తలెత్తుతున్నా రుు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వసంతలక్ష్మీ(28)- వెంకటేశ్ భార్యాభర్తలు. వీ రికి మూడేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వసంతలక్ష్మీ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తుండగా, వెంకటేశ్ వ్యవసాయం చేస్తున్నాడు. రెండునెలల క్రితం వసంతలక్ష్మీ గ్రామానికి చెందిన ఎర్నేని సురేష్(25)తో చనువుగా ఉంటుందని వెంకటేశ్ అనుమానించాడు. భా ర్యను నిలదీయగా తనకేపాపం తెలియదని, అతడే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పింది. దీంతో వెంకటేశ్ పో లీసులకు ఫిర్యాదు చేయగా సురేష్ జైలుకెళ్లాడు. ఆ త ర్వాత బెరుుల్‌పై వచ్చిన సురేష్, వసంతలక్ష్మీతో ఎప్పట్లాగే చనువుగా ఉండడం ప్రారంభించాడు. వారం క్రితం పుట్టింటికి వెళ్లిన వసంతలక్ష్మీ శుక్రవారం గ్రామానికి వచ్చింది. ఉట్లపల్లిలో అక్కబావ దగ్గర ఉంటున్న సు రేష్ కూడా అదే రోజు గ్రామానికి వచ్చాడు. శనివారం వే కువజామున ఊరి చివర ఓ పెసరకల్లంలో వసంతలక్ష్మీ, సురేష్ శవాలై కనిపించారు. గొడ్డలితో నరికి చంపిన ఆనవాళ్లు కనిపించారుు. వెంకటేశ్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని సీఐ శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశా రు. ఎస్సై నరేశ్‌తో కలసి శనివారం ఆయన సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. విచారణ ప్రారంభించినట్లు చె ప్పారు. హత్యలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై స మాచారం సేకరిస్తున్నామని చెప్పారు.