వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి...
టీడీపీ నాయకుడు సుజానా చౌదరి తొలిసారిగా కేంద్ర కేబినెట్ లో దక్కించుకున్నారు. కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం(నవంబర్ 9) ప్రమాణస్వీకారం చేశారు. పారిశ్రామికవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తర్వాత రాజకీయాలవైపు అడుగులు వేశారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటూ టీడీపీలో వడివడిగా ఎదిగారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగుపట్టిన ఆయన కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పటివరకు పత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కడం విశేషం.
వ్యక్తిగత, కుటుంబ వివరాలు
పూర్తిపేరు: యలమంచిలి సత్యనారాయణ చౌదరి
జన్మదినం:1961 జూన్ 2
వయసు: 53
తల్లిదండ్రులు: జనార్దనరావు, సుశీల కుమారి
భార్య: పద్మజ
పిల్లలు: కుమార్తె, కుమారుడు
విద్యార్హత: మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్
పార్టీ: టీడీపీ
రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్
నివాసం: హైదరాబాద్
రాజకీయ నేపథ్యం
రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్తగా సుపరిచితుడు.
సుజనా గ్రూప్ కంపెనీల వ్యవస్థాపకుడు
తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు
ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేయలేదు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు
2010 జూన్ 22న తొలిసారి రాజ్యసభకు ఎన్నిక
2014 నవంబర్ 9న కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం