దేశవ్యాప్తంగా పశువధ నిషేధంపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.
విశాఖ : దేశవ్యాప్తంగా పశువధ నిషేధంపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. ఇలాంటి నిర్ణయత్మక చర్యల అభినందనీయమని ఆయన ప్రశంసించారు. మాటలకే పరిమితం కాకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని స్వరూపానందేంద్ర సరస్వతి డిమాండ్ చేశారు. కాగా దేశవ్యాప్తంగా పశువధను నిషేధిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.