సాధిక్ హత్య ... కాంట్రాక్ట్ మర్డర్ | Tadipatri police solve tdp counselor murdered mystery | Sakshi
Sakshi News home page

సాధిక్ హత్య ... కాంట్రాక్ట్ మర్డర్

Published Fri, Oct 31 2014 12:05 PM | Last Updated on Sat, Aug 11 2018 4:24 PM

Tadipatri police solve tdp counselor murdered mystery

అనంతపురం: తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్ సాదిఖ్ హత్య కేసును జిల్లా పోలీసులు  ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి రౌడీ షీటర్ జావెద్తో సహా 8 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వారి వద్ద నుంచి మూడు వేట కొడవళ్లు, రెండు పిడిబాకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని వారు పేర్కొన్నారు. సాధిక్ హత్య కాంట్రాక్ట్ మర్డర్ అని పోలీసులు చెప్పారు.

అక్టోబర్ 23వ తేదీన తాడిపత్రిలో సాధిక్పై కొంత మంది ఆగంతకులు దాడి చేసి వేటకొడవళ్లుతో నరికారు. దీంతో అతడు రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. అనంతరం ఆగంతకులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన సాధిక్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాధిక్ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులోభాగంగా ఈ హత్యలో ప్రమేయం ఉన్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement