కేవీకేను సందర్శించిన తమిళ రైతులు
కడప అగ్రికల్చర్ :
ఊటుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని బుధవారం తమిళనాడుకు చెందిన రైతులు సందర్శించి చిరుధాన్యాల సాగు వివరాలను గృహ విజ్ఞాన శాస్త్రవేత్త టి స్వర్ణలతాదేవిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన చిరుధాన్యాల చిత్ర ప్రదర్శనను రైతులు తిలకించారు. కొర్రలు, సామలు, సజ్జ, జొన్న, నువ్వులను ఏయే కాలాల్లో పండిస్తారని శాస్త్రవేత్తను అడిగారు. ఆయా పంటల విత్తనాలను, చిరుధాన్యాలతో తయారు చేసిన ఉప ఉత్పత్తులను వారు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా రైతుల వెంట వచ్చిన కోయంబత్తూరులోని జాతీయ ఉద్యాన పరిశోధన అభివృద్ధి సంస్థ సాంకేతిక అధికారి జ్ఞాన సుందరం మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సాగవుతున్న చిరుధాన్యపు పంటలను తమ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా రైతుల చేత సాగు చేయిస్తామన్నారు.
కృషి విజ్ఞాన కేంద్రా, తమిళనాడు, రైతులు