‘క్వీన్ ఆఫ్ ఇండియా’ లక్ష్యం | Target is queen of India | Sakshi
Sakshi News home page

‘క్వీన్ ఆఫ్ ఇండియా’ లక్ష్యం

Published Tue, Feb 4 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

‘క్వీన్ ఆఫ్ ఇండియా’ లక్ష్యం

‘క్వీన్ ఆఫ్ ఇండియా’ లక్ష్యం

మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా టైటిల్ సొంతం చేసుకోవడమే లక్ష్యమని మిస్ క్వీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రష్మీసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అందాలపోటీలపై ఆసక్తి చూపాలి
మంచి అవకాశమొస్తే నటిస్తా
మిస్ ఆంధ్రప్రదేశ్ బ్యూటీ క్వీన్ రష్మీసింగ్

 
 మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా టైటిల్ సొంతం చేసుకోవడమే లక్ష్యమని మిస్ క్వీన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రష్మీసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్మీ ఇటీవల కోయంబత్తూర్‌లో నిర్వహించిన పోటీల్లో మిస్ క్వీన్ ఆఫ్ ఏపీ టైటిల్ గెలుపొందారు. సోమవారం గోదావరఖనిలో శాప్ మాజీ చైర్మన్ మక్కాన్‌సింగ్ ఠాకూర్ నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్టీపీసీకి చెందిన తాను హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తుండగా అందాల పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఏర్పడిందని చెప్పారు. అందాల పోటీ అంటే బికినీలు వేసుకోవడమని చాలా మంది భావిస్తారని, కానీ, మణప్పురం గోల్డ్ వారు కోయంబత్తూర్‌లో మొట్టమొదటిసారిగా సంప్రదాయబద్ధంగా పోటీలు నిర్వహించారని చెప్పారు.
 
 అందం, తెలివితేటలు, సమయస్ఫూర్తి, తక్షణ స్పందనపై సమాధానం చెప్పడం తదితర అంశాలపైనే నిర్వహించారని వివరించారు. ఇలాంటి పోటీల్లో పాల్గొనేందుకు తెలుగు అమ్మాయిలు ఆసక్తి చూపి ప్రతిభను చాటాలని కోరారు. త్వరలో ముంబయ్ లేదా ఢిల్లీలో జరగనున్న మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా పోటీలకు సిద్ధమవుతున్నానని తెలిపారు. దక్షణాది నుంచి ముఖ్యంగా తమిళ చిత్రసీమ నుంచి సినిమా అవకాశాలు వస్తున్నాయని, మంచి బ్యానర్‌తో నిర్మించే చిత్రాల్లో నటించేందుకు అంగీకరిస్తానని వెల్లడించారు. రష్మీసింగ్‌ను మక్కాన్‌సింగ్ అభినందించారు.           - న్యూస్‌లైన్, గోదావరిఖని  

Advertisement

పోల్

Advertisement