పేదోడి గూడుకూ ఎసరు!
అర్హులైన పేదలందరికీ మూడు సెంట్ల స్థలంతోపాటు లక్షన్నర రూపాయలతో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం..
- ఇదీ సాధారణ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ.
కానీ.. అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మూడు సెంట్ల స్థలంలో పక్కా ఇంటి సంగతిని పక్కన బెట్టేసింది. ఆన్‌లైన్‌లో జరిగే ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపును నిలిపేసి వేలాది మంది లబ్ధిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో రచ్చబండ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన వేలాది దరఖాస్తులను బుట్టదాఖలు చేసి పేదలను నిరాశ పరుస్తోంది.
సాక్షి, గుంటూరు: అప్పో సప్పో చేసి.. ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు టీడీపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆన్‌లైన్‌లో జరిగే బిల్లుల చెల్లింపును నిలిపివేయటం ద్వారా ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తి చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నవారికి రిక్తహస్తం చూపుతోంది. బిల్లుల చెల్లింపునకు సంబంధించిన ఆన్‌లైన్ సైట్ పూర్తిగా నిలిచిపోవటం లబ్ధిదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వైఖరిపై బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇదీ సంగతి.: జిల్లాలో ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణ ంలో ఉన్న 23,521 ఇళ్లతోపాటు దాదాపు పూర్తయిన 10 వేలకుపైగా ఇళ్లకు బిల్లులు చెల్లించలేదు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి నెలలో బిల్లుల చెల్లింపునకు సంబంధించిన ఆన్‌లైన్ సైట్‌ను నిలిపివేశారు. టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఏడు వారాలు గడుస్తున్నా మళ్లీ ఇంతవరకు దాన్ని తెరువలేదు. దీంతో బిల్లుల సొమ్ము కోసం ఎదురుచూస్తున్న పేదలకు నిరాశే మిగిలింది. మరోవైపు ప్రభుత్వం కొత్త ఇళ్ల మంజూరు ఊసెత్తడం లేదు. వచ్చిన దరఖాస్తులపై పూర్తిస్థారుు విచారణ జరిపాకే కొత్తవాటిని మంజూరు చేయూలని నిర్ణరుుంచినట్టు సమాచారం.
రచ్చబండ దరఖాస్తులు బుట్టదాఖలే..: సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలో 78 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిపై విచారణ జరిపి అర్హులను గుర్తించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇంతలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దీనిని కొనసాగించాల్సి ఉంది. కానీ దరఖాస్తుల పరిశీలనను నిలిపివేయాలని మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. దీంతో రచ్చబండలో వచ్చిన దరఖాస్తులన్నీ బుట్టదాఖలైనట్టేనని అధికారులు అంటున్నారు.
ఆన్‌లైన్ సైట్‌ను నిలిపివేశారు..
ఈ విషయమై జిల్లా హౌసింగ్ పీడీ సురేష్‌బాబును వివరణ కోరగా ఆన్‌లైన్ సైట్‌ను నిలిపివేయటంతో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపు నిలిచిపోరుునట్టు చెప్పారు. జిల్లాలో కొత్త ఇళ్ల కోసం 78 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిపై విచారణ జరిపి అర్హుల జాబితాను రూపొం దించాల్సి ఉందని తెలిపారు. కానీ ఈ ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోరుుందని పేర్కొన్నారు.