వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్పై టీడీపీ వర్గీయుల దాడి | tdp cadre attacks ysrcp corporator in Rajahmundry municipal corporation | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్పై టీడీపీ వర్గీయుల దాడి

Published Wed, Mar 4 2015 11:22 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

tdp cadre attacks ysrcp corporator  in Rajahmundry municipal corporation

రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం బుధవారం రసాభాసగా మారింది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు రోజూ కూర్చునే సీట్లలో టీడీపీ కార్పొరేటర్లు కూర్చున్న విషయంలో వివాదం మొదలైంది. దీనిపై ప్రశ్నించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్పై టీడీపీ వర్గీయులు దాడి చేశారు.

 

ఇదే సమయంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీ వర్గీయులు పరస్పరం కుర్చీలతో కొట్టుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement