టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ కాల్ ట్రూకాలర్ స్క్రీన్ షాట్
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్/శ్రీకాకుళం: ప్రజాస్వామ్యంలో ఓటు రహస్యంగా వేస్తారు. ఆ రహస్యాన్ని కాపాడేందుకు ఎన్నికల సంఘం అనేక చర్యలు తీసుకుంటుంది. టీడీపీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ వస్తున్న రికార్డింగ్ కాల్స్ ఓటర్లను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఎచ్చెర్ల నియోజక వర్గంలో సోమవారం పలు కాల్స్ టీడీపీ కార్యాలయం నుంచి పలువురికి వచ్చాయి. ఆ కాల్ సందర్భంగా మూడు ప్రశ్నలు వేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కళావెంకటరావుకు ఓటు వేస్తే ఒకటి నొక్కండి, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి గొర్లె కిరణ్‌కుమార్‌కు ఓటు వేస్తే రెండు నొక్కండి, జనసేన అభ్యర్థి బాడాన వెంకట జనార్దనరావుకు ఓటు వేస్తే మూడు నొక్కండి అంటూ ఫోన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోప్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. ఫోన్ సర్వే అభ్యర్థుల పేరు మీద వస్తుండడం చిరాకు కల్గిస్తోంది. టీడీపీ కార్యాలయం నుంచి కాల్ చేసి ఏపార్టీకి ఓటు వేస్తారు? అని అడిగే ప్రశ్న ప్రజలకు వింతగా అనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment