అధ్యక్షుడి ఫొటో ఏదీ! | TDP Jana Chaitanya Yatras | Sakshi
Sakshi News home page

అధ్యక్షుడి ఫొటో ఏదీ!

Published Fri, Dec 4 2015 2:04 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM

అధ్యక్షుడి ఫొటో ఏదీ! - Sakshi

అధ్యక్షుడి ఫొటో ఏదీ!

దెందులూరు : జనచైతన్య యాత్ర తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు నాయుడు గురువారం దెందులూరులో పర్యటించారు. పర్యటన అనంతరం జెడ్పీ హైస్కూల్ వద్ద బహిరంగ సభ జరిగింది. వేదికపై భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానిపై  రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఫొటో లేకపోవడం గమనార్హం. చంద్రబాబునాయుడు, ఎంపీ మాగంటి బాబు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , జిల్లా పార్టీ పరిశీలకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఫొటో లేకపోవడం చర్చనీయాంశమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement