
రాబందు రాక్షస క్రీడ!
► అమరావతినే కాదు..పల్లెలనూ వదలని టీడీపీ నేతలు
► అనంతవరంలో మితి మీరినఎంపీటీసీ మాజీ సభ్యుడు
► కసుకుర్తి బాలకోటయ్య భూ ఆక్రమణలు
►పార్టీలకు అతీతంగా టంగుటూరుతహశీల్దార్‌కు ఫిర్యాదు చేసిన ప్రజలు
కానల్లో కనిపించే రాబందులు కళేబరాలను మాత్రమే పీక్కు తింటారుు..
అవి జీవం ఉన్న వాటి జోలికి వెళ్లవు !అనంతవరంలో ఉన్న రాబందు.. బతికి ఉండగానే..
దళిత రైతులను నంజుకు తింటోంది!! - టంగుటూరు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు భూముల పంపిణీ చేశారు. ఆ సయంలోనే అనంతవరానికి చెందిన 50 మంది పేదలకు ఒక్కొక్కరికి 40 సెంట్లు చొప్పున మొత్తం 20 ఎకరాాలు పంచారు. అందుకు సంబంధించిన రికార్డులను అప్పటి తహసీల్దార్ గాంధీ పక్కాగా రూపొందించారు. తొలి విడత భూములు దక్కించుకున్న వారిలో 13 మంది పేర్లు ఆన్‌లైన్‌లో గోల్‌మాల్ అయ్యూరుు. వీరి స్థానంలో అనంతవరం టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కసుకూర్తి బాలకోటయ్య అనుయాయుల పేర్లు రెవెన్యూ రికార్డులో ప్రత్యక్షమయ్యాయి. అన్‌లైన్లోనూ పాత లబ్ధిదారుల స్థానంలో టీడీపీ నేత సూచించిన కొత్త పేర్లు ఉన్నారుు. విషయం తెలిసి లబ్ధిదారులు కంగారు పడ్డారు. స్వయంగా అనంతవరానికే చెందిన మరొక టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ సభ్యుని తల్లి పేరు కూడా మాయం కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఇది చర్చనీయూంశమైంది.
తాజా వివాదం ఇదీ..
ఆ గ్రామానికే చెందిన మరో టీడీపీ నేత కసుకుర్తి భాస్కర్‌రావు శుక్రవారం తహశీల్దార్‌ను కలిసి లబ్ధిదారుల రికార్డు గోల్‌మాలైన విషయంపై ఫిర్యాదు చేశాడు. అక్రమంగా రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ చేసి కొత్తగా ఎక్కించిన పేర్లు తొలగించి నిజమైన లబ్ధిదారుల పేర్లు ఆన్‌లైన్ చేర్చాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారుల వల్లే సదరు నేత అక్రమానికి పాల్పడగలిగాడని, గ్రామంలో అనేక భూకుంభకోణాలతో సంబంధం ఉన్న ఆయన మాటే వేద వాక్కుగా తహశీల్దార్ కార్యాలయంలో కొనసాగుతోందని మండిపడ్డారు. రెవెన్యూ ఉద్యోగులు కొందరు ఆయన కనుసన్నలో ఎందుకు పని చేస్తున్నారని భాస్కర్‌తో పాటు అదే గ్రామానికి చెందిన కొందరు తహశీల్దార్‌ను నిలదీశారు
నోటీసుల జారీ
గ్రామస్తుల ఒత్తిడితో తహశీల్దార్ కామేశ్వర్‌రావు ఆ భూములకు సంబంధిన వాస్తవ లబ్ధిదారులు 13 మందితో పాటు వారి స్థానాల్లో కొత్తగా ప్రత్యక్షమైన వారికి ఇది వరకే నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగా శుక్రవారం వాస్తవ లబ్ధిదారులంతా తమ ఆధారాలతో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. టీడీపీ నాయకుడు కసుకుర్తి బాలకోటయ్య తన అనుయాయులను కొంతమందిని వెంటేసుకొని వచ్చాడు. పాత వారంతా తమ రికార్డులను అధికారులకు సూపించారు. టీడీపీ నేత మాత్రం ఎటువంటి ఆధారాలు లేకుండా వచ్చి కొందరు అధికారులతో గుసగుసలాడి వెళ్లాడు.
అధికార పార్టీ నేతల భూదాహం ఇంకా తీరినట్టు లేదు. టీడీపీ అగ్ర నేతల నుంచి గ్రామ స్థారుు నేతల వరకూ అందిరిదీ ఒకే దారి. ముఖ్య నేతలు నూతన రాజధాని అమరావతి చుట్టూ కనిపించిన ఖాళీ స్థలాలను అప్పనంగా స్వాధీనం చేసుకుంటుంటే.. గ్రామస్థారుు నేతలు కూడా తామేం తక్కువ తిన్నామా.. అంటూ పల్లెల్లో యథేచ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. మండలంలోని అనంతవరంలో అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీటీసీ భూ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. సుమారు 20 ఏళ్ల నుంచి ఆయన అక్రమాలు అప్రతిహాసంగా సాగిపోతున్నా అధికారులుగానీ ప్రజాప్రతినిధులుగానీ ఏమీ చేయలేకపోతున్నారంటే ఆయన ఏ స్థారుులో ఉన్నతాధికారులను సైతం మభ్య పెడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఆ టీడీపీ నేత వల్లే ఘర్షణలు
మరో టీడీపీ నేత భాస్కర్ మాట్లాడుతూ వాస్తవ లబ్ధిదారులంతా పేదవారేనని, ఒక్కరి కోసం ఇంత మందికి అన్యాయం చేయవద్దని తహశీల్దార్‌ను కోరారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేతలు సర్పంచి కసుకుర్తి సుందర్‌రావు, ఎంపీటీసీ కసుకుర్తి గోవిందమ్మ, న్యాయవాది కసుకుర్తి వీరరాఘవులు, గ్రామపెద్ద కసుకుర్తి వెంకటేశ్వర్లు (ఎల్‌ఐసీ వెంకటేశ్వర్లు) విడివిడిగా తహసీల్దార్‌ను కలిసి నిజమైన పాత లబ్ధిదారులకు న్యాయం చేయాలని, రికార్డు ట్యాంపరింగ్ చేసిన సదరు మాజీ ఎంపీటీసీని కఠినంగా శిక్షించాలని కోరారు.
అధికార పార్టీని అడ్డం పెట్టుకొని అతను చేస్తున్న భూవివాదాలతో గ్రామానికి చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్రామంలో తరచూ వివాదాలు జరుగుతున్నాయని చెప్పారు. కార్యాలయంలోని కొత్తమంది సిబ్బంది ఆ నాయకునికి రెవెన్యూ రికార్డు అప్పజెబుతున్నారని కూడా ఫిర్యాదు చేశారు.