రేవంత్ రెడ్డికి అవగాహన లేదు: సీతారాం నాయక్
హైదరాబాద్: గిరిజన చట్టాలపై తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేకు రేవంత్‌రెడ్డికి అవగాహన లేదని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ విమర్శించారు. గిరిజనుల హక్కులను ఉల్లంఘించే విధంగా టీడీపీ నేతలు వ్యహరిస్తున్నారని సీతారాం నాయక్ ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో గందరగోళం సృష్టించే విధంగా టీడీపీ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. భద్రాచలంలో టీడీపీ నేతలు యువకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని సీతారాంనాయక్ మీడియాకు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ నేతలు స్పష్టమైన వైఖరిని తెలిపాలని ఆయన సూచించారు.