seetaram naik
-
BRS: ఆరూరి ఇంటి వద్ద హైడ్రామా.. బీజేపీ నేతలు సీరియస్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రెడీ కావడంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా క్రియేట్ అయ్యింది. రంగంలోకి దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆయనను తన కారుతో వేరే చోటకు తరలించారు. ఇక, పరిణామాలపై బీజేపీ నేత సీతారాం నాయక్ స్పందించారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరూరి రమేష్ ఇంటి వద్ద చోటుచేసుకున్న పరిణామాలు నాటకీయంగా ఉన్నాయి. నిన్న(మంగళవారం) అమిత్ షాను కలిసి బీజేపీలో చేరేందుకు రమేష్ రెడీ అయ్యారు. ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీలో జాయిన్ అవుతున్నా అని ప్రకటిస్తున్నానని మాకు చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఆరూరి ఇంటికి వెళ్లి ప్రవర్తించిన తీరు సరికాదు. రమేష్ తన ఇష్టంతో సొంత నిర్ణయం తీసుకుంటే వీరికి వచ్చిన బాధేంటి?. బీఆర్ఎస్ నేతలు రమేష్ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ డ్రామాలన్నీ ప్రజలు చూస్తున్నారు. గతంలో నా రాజకీయ జీవితం కూడా బీఆర్ఎస్ నేతలే నాశనం చేశారు. నాకు BRS చేసిన అన్యాయంపై 151 బుక్స్ రాయవచ్చు. దళితులకు వీళ్ళు గతంలో ఏమి చేశారని ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ వాళ్లు ఎం హామీ ఇస్తారు?. గతంలో ఎప్పుడైనా ఆరూరికి ఎర్రబెల్లి మద్దతుగా ఉన్నాడా?. ఆరూరి జీవితంతో ఎర్రబెల్లి, బీఆర్ఎస్ నేతలు ఆడుకోవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రేసులో ముగ్గురు!
సాక్షి, కొత్తగూడెం: మహబూబాబాద్ లోక్‌సభ స్థానం టీఆర్ఎస్ టికెట్ కోసం త్రిముఖ పోటీ నెలకొంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల కోడ్ రానుండడంతో పాటు, ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఈనెల 16న మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించిన ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ టికెట్‌పై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. సన్నాహక సమావేశం అనంతరం అభ్యర్థి విషయమై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల సమాయత్తంలో కాంగ్రెస్ కంటే అనేక అడుగులు ముందంజలో ఉన్న టీఆర్ఎస్.. అభ్యర్థులనూ ముందే ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ మదిలో ఏముందో అని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. కాగా, మానుకోట టికెట్ ఈసారి కూడా తనకే వస్తుందని సిట్టింగ్ ఎంపీ సీతారాంనాయక్ ధీమాగా ఉన్నారు. మరోవైపు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి తేజావత్ రామచంద్రునాయక్ సైతం టికెట్ రేసులో ముందున్నారు. రామచంద్రు గత రెండేళ్లుగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ కుమార్తె కవిత కూడా ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు. ఎవరి అంచనాలు వారివే... సీతారాంనాయక్ సిట్టింగ్ ఎంపీ కావడంతో ఆయనకే టికెట్ వస్తుందని కొందరు కార్యకర్తలు అంచనాలు వేసుకుంటున్నారు. మరోవైపు ఢిల్లీలో పలుకుబడి ఎక్కువగా ఉన్న రామచంద్రు అయితే కేంద్రం నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు సాధించే అవకాశం ఉంటుందని, దీంతో ఆయనకే అవకాశం లభించవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇక కవిత పేరు సైతం బాగానే వినిపిస్తోంది. ముఖ్యంగా డోర్నకల్, మహబూబాబాద్ సెగ్మెంట్ల పరిధిలో కవితకు టికెట్ ఖాయమనే చర్చలు నడుస్తున్నాయి. కవిత గతంలో మహబూబాబాద్ ఎమ్మెల్యేగానూ ప్రాతినిధ్యం వహించారు. డోర్నకల్ నుంచి గెలిచిన రెడ్యానాయక్ ప్రస్తుతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఆయన వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం లభించింది. అలాగే మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్న సత్యవతిని మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్‌గా నియమించారు. ఆమె ఇప్పటికే భద్రాచలం, ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ సెగ్మెంట్ల పరిధిలో సమావేశాలు నిర్వహించారు. ఇక తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ఇన్చార్జ్గా కేసీఆర్ నియమించారు. అభ్యర్థి ఎంపికకు టీఆర్ఎస్ సర్వే... మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం టీఆర్ఎస్ పలుమార్లు సర్వేలు సైతం చేయించింది. భద్రాద్రి జిల్లాతో పాటు ములుగు సెగ్మెంట్లలో సిట్టింగ్ ఎంపీపై కొంతమేర వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థిని మార్చాలని మెజారిటీ సెగ్మెంట్లలో పార్టీ శ్రేణులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తేజావత్ రామచంద్రు పేరు ఎక్కువగా వినపడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలో దింపుతుందనే విషయాన్ని కూడా కేసీఆర్ పరిగణలోకి తీసుకుంటారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక రెడ్యానాయక్‌కు వివిధ సమీకరణల్లో భాగంగా మంత్రి పదవిని కేటాయించలేని పక్షంలో సంతృప్తి పరిచేందుకు ఆయన కుమార్తె కవితకు మహబూబాబాద్ లోక్‌సభ టికెట్ కేటాయిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత డిసెంబర్లో మహబూబాబాద్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సీతారాంనాయక్‌ను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో టికెట్ తనకేనని సీతారాం ధీమాగా ఉన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు శాసనసభ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. కీలకమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, భద్రాచలం, ఇల్లెందు, ములుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిని మారుస్తారా అనే వా దనలు సైతం వస్తున్నాయి. ఇదే జరిగితే కేసీఆర్ వద్ద మంచి పేరు, పలుకుబడి ఉన్న రామచం ద్రుకు అవకాశం లభిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిన రామచంద్రు.. ఈసారి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా రు. టికెట్ ప్రయత్నాల్లో భాగంగా మానుకోట లోక్‌సభ పరిధిలో ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. మళ్లీ రేపటి నుంచి అన్ని సెగ్మెంట్లలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. భద్రాద్రి జిల్లానే కీలకం.. మానుకోట లోక్‌సభ పరిధిలో భద్రాద్రి జిల్లాలో ఉన్న సెగ్మెంట్లు అత్యంత కీలకం. ఇక్కడ అత్యధికంగా మూడు సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే అన్నిచోట్లా విపక్ష కాంగ్రెస్ గెలుపొందింది. తాజాగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గులాబీ తీర్థం పుచ్చుకోనుండడంతో టీఆర్ఎస్లో జిల్లా వ్యాప్తంగా మరింత జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ విషయమై పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. మరి ఈ ముగ్గురిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
కోట సీటెవరికో?
సాక్షి, కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో మహబూబాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి విషయమై రాజకీయవర్గాలు, టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ టికెట్ తనకే వస్తుందని సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ ధీమాగా ఉన్నారు. గత డిసెంబర్లో మానుకోటలో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీతారాంనాయక్‌ను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో టికెట్ తనదేననే ధీమాతో సీతారాంనాయక్ ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఇందులో కీలకమైన పినపాక, భద్రాచలం, ఇల్లెందు, జయశంకర్ జిల్లాలోని ములుగు స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిని మారుస్తారా అనే అంశంపై టీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఉన్నాయి. కాగా గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వస్తుందనుకున్న ఎంపీ టికెట్ కోల్పోయిన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రామచంద్రు సైతం ఈసారి మహబూబాబాద్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద రామచంద్రుకు మంచి పేరు, పలుకుబడి ఉన్నాయి. గత ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిందని, ఈసారి అవకాశం పొందాలని రామచంద్రు ప్రయత్నిస్తున్నారు. ఐఏఎస్ అధికారి అయిన రామచంద్రు ఒడిశాలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. పైగా ఢిల్లీలో పలువురు ఐఏఎస్‌లతో సత్సంబంధాలు ఉండడంతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అనేక సానుకూల ఫలితాలు రాబట్టారు. రామచంద్రు వల్లే ఢిల్లీలో సీఎం కేసీఆర్ పలుకుబడి మరింతగా పెరిగింది. రాష్ట్రానికి సంబంధించిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ క్లియరెన్సులు, బీటీపీఎస్‌కు అనుమతులు, 3,100 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా చేయిండంలో రామచంద్రు ఢిల్లీలో సక్సెస్ అయ్యారు. అలాగే 26 దేశాల్లో పర్యటించి అంతర్జాతీయ వేదికలపై దేశ వాణి వినిపించారు. నీతిఅయోగ్, ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ క్రమంలో రామచంద్రు ఎంపీ టికెట్ ఆశిస్తుండడంతో కార్యకర్తల్లో ఆసక్తి పెరిగింది. కాగా, జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ సెగ్మెంట్లలో గత కొన్ని నెలలుగా ఆయన పలుమార్లు పర్యటించారు. ఆ సందర్భంగా ఆయా శాసనసభ నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రామచంద్రుకు ఘనస్వాగతం పలికారు. పోటాపోటీగా క్షేత్రస్థాయి పర్యటనలు.. లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో ఆశావహులు క్షేత్రస్థాయిలోకి మరింతగా చొచ్చుకెళుతున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి విస్తృతంగా ఉండడంతో ఇప్పటికే పర్యటనల వేగం పెంచారు. ఈ లోక్‌సభ స్థానం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇందులో భద్రాద్రి జిల్లానే అత్యంత కీలకమైనది కావడంతో ఇక్కడి సెగ్మెంట్లలో పర్యటనకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మానుకోట పార్లమెంట్ పరిధిలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, ఇల్లెందు, పినపాక, భద్రాచలం శాసనసభ సెగ్మెంట్లు ఉన్నాయి. నర్సంపేట సెగ్మెంట్ వరంగల్ రూరల్ జిల్లాలో, ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, డోర్నకల్, మహబూబాబాద్ సెగ్మెంట్లు మహబూబాబాద్ జిల్లాలో ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఇల్లెందు, భద్రాచలం, పినపాక సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ జిల్లాలోనే మూడు సెగ్మెంట్లు ఉండడంతో ఇదే కీలకం కానుంది. దీంతో ఇక్కడే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. -
వాడీవేడిగా..
సాక్షి, కొత్తగూడెం: ‘జిల్లాలో వివిధ రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ ఒక్క అధికారైనా సరైన ప్రతిపాదనలు పంపించారా..? ఇప్పటివరకు జిల్లాలో ఐదు సార్లు జరిగిన సమావేశాల్లో చెప్పినప్పటికీ ఉపయోగం లేదు. అధికారుల సహకారం లేకపోతే కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను ఎలా సాధించాలి?’ అంటూ మహబూబాబాద్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ అజ్మీరా సీతారాంనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కొత్తగూడెం డీఆర్డీఓ కార్యాలయంలో ‘దిశ’ (జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ) సమావేశం చైర్మన్ సీతారాంనాయక్, కో చైర్మన్ , ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర పథకాలపై చర్చ జరిగింది. పనితీరు సక్రమంగా లేని, కాకిలెక్కలు చెప్పిన అధికారులపై ఎంపీలిద్దరూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్ని శాఖల వివరాలు, గణాంకాలను కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ నోటికి చెబుతుండగా, ఆయా శాఖల జిల్లా అధికారులు మాత్రం కాగితాలు వెతుక్కుంటుండగా.. ‘ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేందుకు సమావేశానికి వచ్చారా..? అసలు ప్రిపేర్ కాకుండా ఎలా వచ్చారు’ అని ఎంపీలు ప్రశ్నించారు. కొన్ని శాఖల నుంచి ద్వితీయ శ్రేణి అధికారులు సమావేశానికి రావడంతో సదరు శాఖాధిపతుల వివరాలను నోట్ చేసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. కొత్తగూడెంలో నర్సింగ్ కళాశాలకుప్రతిపాదనలు ఎందుకు పంపలేదు..? నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద కొత్తగూడెంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు, కొత్త అంబులెన్స్‌లకు ఇప్పటివరకు ప్రతిపాదనలు ఎందుకు పంపలేదని ఎంపీలు ప్రశ్నించారు. అధికారుల సహకారం లేకుంటే పార్లమెంట్లో ఎలా చర్చించాలన్నారు. 2013లో నిర్మాణం పూర్తిచేసుకున్న మణుగూరు ఏరియా ఆస్పత్రిలో ఇప్పటివరకు సేవలు ప్రారంభించలేదని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. గతం దిశ సమావేశాల్లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని, అక్కడి డాక్టర్లందరినీ డిప్యుటేషన్‌పై ఎలా పంపారంటూ వైద్యవిధాన పరిషత్ కో–ఆర్డినేటర్ రమేష్‌ను ప్రశ్నించారు. ఇల్లెందులోని 30 పడకల ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్య సేవలు అధ్వానంగా ఉన్నాయని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. కాగా ఈ ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్‌కు మార్చాలని ఎంపీ సీతారాంనాయక్ సూచించారు. ఇందుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రతిపాదనలు పంపుతానని కలెక్టర్ తెలిపారు. భద్రాచలం, సారపాకలను అటూఇటూ కాకుండా ఎలా ఉంచారు..?: ఎంపీ సీతారాం నాయక్ భద్రాచలం, సారపాక పట్టణాలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రతిపాదనలు పంపించడంపై ఎంపీ సీతారాంనాయక్ నిర్వేదం వ్యక్తం చేశారు. పైనుంచి అడగకపోయినప్పటికీ ఈ ప్రతిపాదనలు పంపడమేమిటన్నారు. ఈ రెండు పట్టణాలు ఇటు గ్రామ పంచాయతీగా కాకుండా, అటు మున్సిపాలిటీగానూ కాకుండా ఉండటం వల్ల ప్రజలకు సరైన సేవలు అందే పరిస్థితి లేదన్నారు. పాల్వంచ మున్సిపల్ కమిషనర్ షఫీఉల్లా సరైన వివరాలు చెప్పకపోవడంతో సరిగ్గా ప్రిపేర్ కాకుండా ఎలా వచ్చావని ఎంపీ సీతారాంనాయక్ షఫీఉల్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్షయపాత్ర పథకం ఎవరికోసం పెట్టారు..? : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అమలు వ్యవహారాన్ని ‘అక్షయపాత్ర’ అనే సంస్థకు ఎవరి ప్రయోజనాల కోసం ఇచ్చారని వనమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సదరు భోజనానికి సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా నాణ్యత, పరిమాణంపై పరిశీలన చేయించాలని కలెక్టర్‌కు సూచించారు. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను కూడా అటవీ శాఖాధికారులు లాక్కుని ఆదివాసీ గిరిజనులపై అక్రమ కేసులు బనాయించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై స్పందించిన ఎంపీ సీతారాంనాయక్ బడాబడా స్మగ్లర్లను వదిలిపెట్టి అమాయక ఆదివాసీలపై అటవీ అధికారులు ఎందుకు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు జులూం వల్ల ఆదివాసీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖాధికారులు నిర్లక్ష్యం వీడాలి: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ గుండాల మండలం సజ్జలగూడెం వద్ద విద్యుత్ తీగలు తెగిపడటంతో 6వ తరగతి విద్యార్థిని మృతి చెందిందని, కొన్ని పశువులు మృతిచెందాయన్నారు. కరకగూడెం మండలంలో ఊరి బయట నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్‌ను మార్చి ఇళ్ల మధ్యనుంచి వేయడమేమిటని ప్రశ్నించారు. గుండాలలో ఇందిర జలప్రభపథకం కింద 9 బోర్లు వేయగా, ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యుత్ సరఫరా చేయకుండా ఆ శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులపై.. మిషన్ భగీరథ పథకం పనులకు సంబంధించి ఆ శాఖాధికారులు కాకిలెక్కలు చెప్పడంతో ఎంపీలు సీతారాంనాయక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఆయా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యం కావడంపట్ల కాంట్రాక్టర్లను ఎందుకు ఉపేక్షిస్తున్నారని, వారేమైనా మీకు చుట్టాలా.. బం«ధువులా..? అంటూ ఎంపీ సీతారాంనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్‌పార్టీ విచారణ జరిపి, తమకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు. ఇల్లెందుకు గతంలో నడిచిన ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలని ఎమ్మెల్యే హరిప్రియ కోరగా, స్పందించిన సీతారాంనాయక్ ఈ విషయంతోపాటు సారపాక రైల్వేలైన్ విషయంపై కూడా కేంద్ర మంత్రితో మాట్లాడతానన్నారు. జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం, టేకులపల్లి, గుండాల, ములకలపల్లి, ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలాలకు ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేశానని సీతారాంనాయక్ పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 100 మంది విద్యార్థులతో వీటిని ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు పే ర్కొన్నారు. ఇప్పటికే మహబూబాబాద్ పట్టణంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం మంజూరైందని, త్వరలో కొత్తగూ డెం పట్టణంలో కూడా పాస్‌పోర్ట్ కేంద్రం మంజూరు చేసే విధంగా ప్రతిపాదనలు చేశామన్నారు. సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డీఎంఎఫ్ నిధులను ఏకపక్షంగా ఎలా కేటాయిస్తారు..? ఎంపీ పొంగులేటి సింగరేణి గనులు విస్తరించి ఉన్న కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాలకు సంబంధించి వచ్చిన రూ.441 కోట్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులను ఏ విధంగా కేటాయించారని డీఆర్డీవో జగత్‌కుమార్ రెడ్డిని ఎంపీ పొంగులేటి ప్రశ్నించారు. ఇప్పటివరకు కొత్తగూడెం నియోజకవర్గానికి రూ.95 కోట్లు, ఇల్లెందు నియోజకవర్గానికి రూ.71.90 కోట్లు, పినపాక నియోజకవర్గానికి రూ.21.80 కోట్లు కేటాయించినట్లు డీఆర్డీవో తెలిపారు. తాము ఇద్దరం ఎంపీలము ఇచ్చిన ప్రతిపాదనలను పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎలా కేటాయిస్తారని పొంగులేటి అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసి చర్చించాలని నిర్ణయించారు. -
‘టీఆర్ఎస్ను వీడటం లేదు’
సాక్షి, హైదారాబాద్ : తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు పార్టీ మారుతున్నారని రేవంత్ చెప్పడం.. పేపర్లలో రావడం.. ఓ మైండ్‌గేమ్‌లా ఉందని ఎంపీ పేర్కొన్నారు. రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారుతున్న ఆ ఇద్దరు ఎంపీలేవరో వెల్లడించాలని సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి దుర్మార్గపు పనులు చేస్తున్నారని.. అవి ఆయన ఎదుగుదలకు పని చేయవు అని అన్నారు. రేవంత్ ప్రవర్తన గురించి అందరికీ తెలుసన్నారు. టీఆర్ఎస్ వీడుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఆ పార్టీ మరో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఖండించారు. రేవంత్ రెడ్డి కావాలనే తనపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా విషయాన్ని ఖండించినట్లు తెలుస్తోంది. -
మహాకూటమి దొంగ కూటమి
సాక్షి, హుస్నాబాద్: 67 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో గిరిజనుల్లో ఏలాంటి మార్పు రాలేదని, మళ్లీ ఓట్లకోసం తండాలకు ఏ ముఖం పెట్టుకోని వస్తారని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో గిరిజనుల ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎంపీ సీతారాంనాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ పాలనలో రాష్ట్రంలో 1.80 మంది గిరిజనులపై గుడుంబా కేసులు పెట్టారని, ఇందులో లక్ష మంది చనిపోయారన్నారు. మహాకూటమి దొంగ కూటమని, కోదండరాంను కూటమిలోకి రమ్మని టికెట్ల కోసం వార్‌రూం, స్క్రీనింగ్ కమిటీల చుట్టూ తిప్పుతున్నారని, ఏ రూంకు పోయిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఓడించలేదని అన్నారు. గిరిజనులకు 9శాతం రిజర్వేషన్లు కావాలని కోరామని, అందుకు వ్యతిరేకంగా 198 కేసులు వేశారని అన్నారు. 50శాతం రిజర్వేషన్లుకు మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. గోరుగోలి భాష మాట్లాడమే గొప్పతనం.. లంబాడిలీలు మాట్లాడే భాష గోరుగోలి భాష అని, ఆ భాష మాట్లాడటం గిరిజనుల గొప్పతనమని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన, ఏ దేశానికి వెళ్లిన లంబాడీల జాతి ఒక్కటే గోరుగోలి భాష మాట్లాడుతారన్నారు. మా దైవమైన సేవాలాల్ మహారాజ్ కొరుకున్న మా జాతిలో మార్పు రావాలంటే కేసీఆర్‌ను సీఎం, ఎమ్మెల్యేగా సతీష్‌కుమార్‌ను గెలిపించుకుంటేనే ఆ కల నిజమైతదని సీతారాంనాయక్ గిరిజనులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రూప్సింగ్, కర్ర శ్రీహరి, రాష్ట్ర నాయకులు పేర్యాల రవీందర్రావు, ఎంపీపీ భూక్య మంగ, భీమదేవరపల్లి జెడ్పీటీసీ రామచంద్రంనాయక్, మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ బీలునాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎడబోయిన తిరుపతిరెడ్డి, పేర్యాల దేవేందర్‌రావు, గిరిజన సంఘాల నాయకులు తిరుపతినాయక్, తదితరులున్నారు. వడ్డెర బతుకులు మారబోతాయి.. హుస్నాబాద్‌రూరల్: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధిలో ముందుకు సాగుతుందని, బీడు భూములకు గోదావరి జలాలను తెచ్చేందుకు రాత్రిబవళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. మంగళవారం మీర్జాపూర్ క్రాసింగ్ శుభం గార్డెన్లో నిర్వహించిన ఒడ్డరుల ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత పాలకుల కాలంలో వడ్డెరులు పేదరికంలో మగ్గెవారన్నారు. నిలువ నీడ లేక, పిల్లలను చదివించుకోనే ఆర్థిక స్థోమత లేక బండ రాళ్లను పిండి చేసే శక్తి ఆ దేవుడు ఇస్తే వారి బతుకులు మార్చే పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి గొప్ప పనులు చేసే సీఎం కేసీఆర్‌ను గద్దె దించుటకు కొందరు దళారులు కూటమి కట్టి మీ ముందుకు వస్తున్నారని మహాకూటమి నాయకులకు వడ్డెరుల గన్ను దెబ్బ ఏట్లా ఉంటుందో చూపించాలన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఒడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దండుగుల రాజ్యలక్ష్మి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్, బొంత సమ్మయ్య, యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు ఎంపీల పనితీరు అంతంతే: కేసీఆర్
-
ముగ్గురు ఎంపీల పనితీరు అంతంతే: కేసీఆర్
హైదరాబాద్: తాను చేయించిన సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆందోళన అక్కర్లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా ఎంపీల పనితీరుపై ఆయన దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. అనంతరం నేతల పనితీరుపై సర్వే వివరాలను వెల్లడించారు. ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, సీతారామ్ నాయక్‌ల పనితీరు అశించిన స్థాయిలో లేదని సర్వే రిపోర్టులో వెల్లడైందన్నారు. పనితీరు బాగాలేదని ఆందోళన చెందవద్దని, భవిష్యత్తులో పనితీరు మెరుగు పరుచుకోవాలని ఆయా నేతలకు కేసీఆర్ సూచించారు. ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో ప్లీనరీ సమావేశం, 27న వరంగల్‌లో బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ లోపు సభ్యత్వ నమోదు పూర్తిచేయాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. ఏప్రిల్ 15లోపు మండల, జిల్లాల కమిటీలను వేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. -
రేవంత్ రెడ్డికి అవగాహన లేదు: సీతారాం నాయక్
హైదరాబాద్: గిరిజన చట్టాలపై తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేకు రేవంత్‌రెడ్డికి అవగాహన లేదని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ విమర్శించారు. గిరిజనుల హక్కులను ఉల్లంఘించే విధంగా టీడీపీ నేతలు వ్యహరిస్తున్నారని సీతారాం నాయక్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో గందరగోళం సృష్టించే విధంగా టీడీపీ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. భద్రాచలంలో టీడీపీ నేతలు యువకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని సీతారాంనాయక్ మీడియాకు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ నేతలు స్పష్టమైన వైఖరిని తెలిపాలని ఆయన సూచించారు.