‘టీఆర్‌ఎస్‌ను వీడటం లేదు’ | konda Vishweshwar And Seetharam Nayak Condemns Quit In TRS | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 15 2018 5:23 PM | Last Updated on Thu, Nov 15 2018 8:53 PM

konda Vishweshwar And Seetharam Nayak Condemns Quit In TRS - Sakshi

సాక్షి, హైదారాబాద్ : తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడారు. ఇద్దరు టీఆర్‌ఎస్ ఎంపీలు పార్టీ మారుతున్నారని రేవంత్ చెప్పడం.. పేపర్లలో రావడం.. ఓ మైండ్‌గేమ్‌లా ఉందని ఎంపీ పేర్కొన్నారు.

రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారుతున్న ఆ ఇద్దరు ఎంపీలేవరో వెల్లడించాలని సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి దుర్మార్గపు పనులు చేస్తున్నారని.. అవి ఆయన ఎదుగుదలకు పని చేయవు అని అన్నారు. రేవంత్ ప్రవర్తన గురించి అందరికీ తెలుసన్నారు.

టీఆర్‌ఎస్‌ వీడుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఆ పార్టీ మరో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఖండించారు. రేవంత్‌ రెడ్డి కావాలనే తనపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా విషయాన్ని ఖండించినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement