టీడీపీ ప్రజాప్రతినిధి కుమారుడికి రిమాండ్
శ్రీకాళహస్తి : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో వరదయ్యపాలెం మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడికి రిమాండ్ విధించారు. శ్రీకాళహస్తి అటవీ రేంజర్ అధికారి(ఎఫ్‌ఆర్‌వో) వెంకటసుబ్బయ్యు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరదయ్యుపాళెం వుండలానికి చెందిన టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సరస్వతవ్ము కువూరుడు కరుణాకర్‌నాయుుడు 2011 డిసెంబరులో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా బుచ్చినాయుడుకండ్రిగ పోలీసులు అరెస్టుచేసి కేసు నమోదు చేశారు.
స్టేషన్ బెయిలు మంజూరు చేసి అతన్ని విడుదల చేశారు. ఆ తర్వాత ఆ కేసును అటవీశాఖ ఉన్నతాధికారులు అటవీ రేంజర్ అధికారి వెంకటసుబ్బయ్యుకు అప్పగించారు. కేసును విచారించి కరుణాకర నాయుడును సోమవారం అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి కోర్టులో హాజరుపరిచారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి చైతన్య 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. అతని నెల్లూరు జైలుకు తరలించారు.