జూలకల్లులో టీడీపీ నేతల దాడికి దెబ్బతిన్న బైక్‌లు
టీడీపీ నేతలు ఓటమి భయంతో పేట్రేగిపోతున్నారు. పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్లలో పోలింగ్ సరళి చూసిన యరపతినేని శ్రీనివాసరావు వర్గీయులు అరాచకాలు సృష్టించారు. తమ పార్టీకి ఓటు వేయలేదనే అక్కసుతో మండలంలోని జూలకల్లులో శుక్రవారం ఉదయం వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముడేల లక్ష్మారెడ్డి, బీరవల్లి నర్సిరెడ్డి, గొలుసుపాటి వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ముస్లిం ప్రాంతంలోని ఇళ్లపై రాళ్లు రువ్వారు. కొందరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దాడిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 200 మంది వరకు పాల్గొన్నట్లు తెలిసింది. దాచేపల్లి మండలంలో రామాపురంలో టీడీపీ నేతలు మారణాయుధాలతో ఇళ్లలోకి ప్రవేశించారు. భయభ్రాంతులకు గురైన మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు.
గుంటూరు, పిడుగురాళ్ల రూరల్: ఎన్నికల వేళ అనేక చోట్ల టీడీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓటమి భయంతో ఓట్లు వేయలేదన్న అక్కసుతో మారణాయుధాలతో తెగబడతున్నారు. మండలంలోని జూలకల్లు గ్రామంలో తాజా మాజీ ఎమ్మెల్యే అనుచరులు శుక్రవారం వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. గ్రామంలో పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో వైఎస్సార్ సీపీకి ఎక్కువ వస్తాయని బాగా చర్చలు జరిగాయి. పలువురు టీడీపీకి ఓటమి తప్పదని చెప్పారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడులకు తెగబడ్డారు. గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద టీ తాగేందుకు శుక్రవారం ఉదయం పలువురు వచ్చారు.
ఎన్నికలపై చర్చించుకుంటున్న సమయంలో టీడీపీ నేతలు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం టీడీపీ చెందిన దామర్లచర్ల హనుమంతరావు, బండ్ల శ్రీను, నర్రా సాంబశివరావు, పోట్ల శ్రీను వీరితోపాటు మరో 200 మంది వైఎస్సార్ సీపీ శ్రేణులపై కత్తులు, వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ముడేల లక్ష్మారెడ్డి, బీరవల్లి నర్సిరెడ్డి, గొలుసుపాటి వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలపాలయ్యారు. లక్ష్మారెడ్డికి తలపై, భుజానికి, పొట్టపై కత్తితో దాడి చేశారు. కర్రలతో కొట్టగా నర్సిరెడ్డి కాలు విరిగింది. వీరితోపాటు మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడ ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులకు చెందిన సుమారు 10 ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. అనంతరం గ్రామంలో ముస్లిం బజారులోకి చొరబడి ఇళ్లపై రాళ్లు రువ్వారు. ఘటనలో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతి పరులను ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. దాడులకు పాల్పడినì వారు గ్రామంలో యథేచ్ఛగా తిరుగున్నా పోలీసులు వారిని పట్టించుకోలేదు. గ్రామంలో సుమారు 24 ఏళ్ల తర్వాత ఇలాంటి ఘర్షణలు జరిగాయి. సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాయాల పాలైన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment