పేదల పట్టాలపై.. రాజకీయాలేలా?
పేదల పట్టాలపై.. రాజకీయాలేలా?
Published Sun, Nov 27 2016 3:26 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/నందిగాం: నకిలీ పట్టాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వారిలో టీడీపీ వారు ఉన్నారని స్వయంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడే ఇటీవల అంగీకరించారు! ఎంతటివారినైనా వదలబోమనీ చెప్పారు. ఇది నాణేనికి ఒక పక్క మాత్రమే! రెండోవైపు టీడీపీలోని అక్రమార్కులను పక్కనబెట్టి తమను ఇక్కట్లు పాల్జేసే కార్యక్రమం సాగుతోందని పట్టాదారులైన పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల సంతకాలతోనే జారీ చేసిన పాసు పుస్తకాలు ఇప్పుడెలా చెల్లకుండా పోతాయో తమకు అర్థం కావట్లేదంటూ వాపోతున్నారు. ఎన్నికల వాగ్దానాల అమల్లో తమ వైఫల్యాలను, ప్రభుత్వ పథకాల్లో దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే అధికార పార్టీ నాయకులు ‘కొండతెంబూరు’ డి పట్టాల వ్యవహారాలను తెరపైకి తెచ్చారని, అధికారుల దర్యాప్తులో తమ్ముళ్ల అక్రమాలు వెలుగులోకి రావడంతో ఇప్పుడు కేవలం తమను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు చేయిస్తున్నారని పట్టాదారులు ఆరోపిస్తున్నారు. కథ అడ్డం తిరగడంతో అధికార పార్టీ నాయకులు జుట్టు పీక్కుంటున్నారని, ఏదోఒక రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకులపై నెపం నెట్టేయాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నారుు.
టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలంలోని కొండతెంబూరు గ్రామ పరిధి సర్వే నంబరు 29లోని కొండపై కొంత మంది అక్రమంగా డి.పట్టాలు పొందారంటూ గతంలోనే పలుమార్లు రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ కొండ పరిధిలో పట్టాలు పొందిన 123 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ పట్టాదారుల్లో కణితూరు, కొండతెంబూరు, దేవుపురం తదితర గ్రామాలకు చెందిన పేదలు ఉన్నారు. వారు తమ వద్దఉన్న ఆధారాలను ఇప్పటికే రెవెన్యూ అధికారులకు చూపించారు. వివరణలు కూడా ఇచ్చారు. మరోవైపు డి పట్టాలతో రుణాలు పొందిన వ్యవహారంపై విజిలెన్‌స అధికారులు బ్యాంకులకు వెళ్లి విచారణ జరుపుతున్నారు. దీంతో నకిలీ డి.పట్టాలతో రుణాల వ్యవహారంలో టీడీపీ కార్యకర్తల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిని తప్పించేందుకు, అలాగే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ఇరికించేందుకు మంత్రి అనుచరులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు.
పదేపదే తనిఖీలు
ఐదుగురు తహసిల్దారులతో కూడిన అధికారుల బృందం శనివారం కణితూరు గ్రామంలో విచారణ ప్రారంభించింది. పట్టాదారులను పిలిపించుకొని వారివద్దనున్న ఆధారాలను పరిశీలించారు. పలువురు పేదలు తమవద్దనున్న పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్‌లు చూపించారు. వాటిని తమకు 2009లో అప్పటి ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర హయాంలో రెవెన్యూ అధికారులు మంజూరు చేశారని చెప్పారు. డి పట్టాలపై రుణాలు మంజూరుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, అప్పటి నుంచి రుణాలు తీసుకొంటూ సక్రమంగా తిరిగి చెల్లిస్తున్నామని పేదలైన లబ్దిదారులు వాపోతున్నారు. తాము అక్రమంగా పట్టాలు పొందినట్టు అధికార పార్టీకి చెందిన నాయకులు తమను రాజకీయ కారణాలతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాగే కొనసాగిస్తే న్యాయం కోసం కోర్టులను ఆశ్రరుుంచడం తప్ప మరో మార్గం లేదని చెబుతున్నారు.
తలపట్టుకుంటున్న రెవెన్యూ అధికారులు
ప్రత్యర్థి వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తేవడంతో చివరకు రెవెన్యూ అధికారుల బృం దం విచారణ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తీరా విచారణలో పట్టాదారుల వద్దనున్న పాసు పుస్తకాలపై తహసీల్దారు, ఆర్డీవో సంతకాలు ఉండటంతో తనిఖీ బృందం కం గుతింది. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు కొండతెంబూరులోనే కాకుండా బడబంద, సొంఠనూరు గ్రామాల పరిధిలోని కొండలపై పట్టాలు పొందిఉండటంతో ఏమి చేయాలో తెలియక అధికారులు తికమకపడుతున్నారు.
Advertisement