దళితులపై టీడీపీ నేతల కక్ష సాధింపు | TDP leaders dalits vengeance | Sakshi
Sakshi News home page

దళితులపై టీడీపీ నేతల కక్ష సాధింపు

Published Thu, Apr 21 2016 1:33 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

TDP leaders dalits vengeance

వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం
జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు

 
పట్నంబజారు (గుంటూరు) : అధికారంలో ఉన్నామని ఇస్టానుసారంగా దళితులపై అక్రమ కేసులు పెడితే సహించబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు స్పష్టం చేశారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్ యూత్, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవను సర్ధుబాబు చేస్తున్న పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గేరా సుబ్బయ్యపై 307 కింద కేసు పెట్టడం దారుణమన్నారు.

16వ తేదీ సుబ్బయ్యను అదుపులోకి తీసుకుని, ఆయన బంధువులు, కుటుంబ సభ్యులకు తెలియకుండా మూడు రోజులు పాటు దాచిపెట్టడం హేయమైన చర్యగా అభిప్రాయపడ్డారు. ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలే దేవరాజు మాట్లాడుతూ ప్రజల కోసం పని చేయాల్సిన పోలీసులు పాలక పక్షానికి కొమ్ముకాయటం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి డొక్కుమళ్ళ రవి మాట్లాడుతూ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ దళితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమావేశంలో వైఎస్సార్ సీసీ పలు విభాగాల నేతలు కొలకలూరి కోటేశ్వరరావు, జంగా జయరాజు, రాచకొండ ముత్యాలరాజు, చిలుకా సుబ్బారావు, డి.సాంబయ్య, జంగమయ్య, నాగయ్య, సాంబయ్య తదిరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement