ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీలకు చేయూతనిచ్చేందుకు ఇచ్చే ఎస్సీ కార్పొరేషన్ రుణాలపైనా టీడీపీ నేతల కన్ను పడింది. లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం విధించిన నిబంధనలను అనుకూలంగా మార్చుకుని కమీషన్లు దండుకుంటున్నారు. కమీషన్ ఇచ్చే లబ్ధిదారులకే రుణాలను కేకేటాయింపు జేబులు నింపుకుంటున్నారు.
ఏలూరు (మెట్రో) : టీడీపీ నేతల ఆగడాలు జిల్లాలో రోజురోజుకూ శృతిమించుతున్నారుు. ఇసుక అక్రమ రవాణా నుంచి మట్టి, గ్రావెల్ తరలింపు, పోలీస్‌స్టేషన్లలో కేసుల సెటిల్‌మెంట్ల వరకు ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్న అధికారపార్టీ నాయకులు ఇప్పుడు మరో దా‘రుణాల’కు ఒడిగట్టారు. సామాజికంగా వెనుకబడిన ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు చేయూతనిచ్చి ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు ఉద్దేశించిన ఎస్సీ కార్పొరేషన్ రుణాల కేటారుుంపులోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
జిల్లాకు 3,677 యూనిట్ల కేటాయింపు
2015-16 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 3 వేల 677 రుణాల యూనిట్లు మంజూరయ్యాయి. వీటి కింద రూ.96 కోట్ల 28 లక్షల నిధులను లబ్ధిదారులకు ఎటువంటి హామీ లేకుండా రుణాలుగా ఇవ్వనున్నారు. జిల్లాలోని 48 మండలాలకు, 8 మునిసిపాలిటీలకు, ఏలూరు కార్పొరేషన్‌కు ఈ యూనిట్లను కేటాయించారు.
టీడీపీ నేతలకు వరంగా మారిన నిబంధనలు
ఈ రుణాల కే కేటాయింపునకు ప్రభుత్వం విధించిన నిబంధనలు అధికార పార్టీ నేతలకు వరంగా మారారుు. మండలాల్లో ఎంపీడీవో, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో కమిషనర్లు ఈ రుణాల లబ్ధిదారులకు వారం రోజులుగా జిల్లాలో ఆయూ చోట్ల ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 101 ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నామినేట్ చేసిన ముగ్గురు సభ్యులు, బ్యాంక్ మేనేజర్, సాంఘిక సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు అధికారులు, ఎంపీపీ కలిపి ఒక కమిటీగా ఉండాలి. ఈ ఏడుగురు కలసి లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీరిలో నలుగురు సూచించిన అభ్యర్థికి రుణాన్ని మంజూరు చేయూలి. ఈ నిబంధనను టీడీపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇన్‌చార్జి మంత్రి నామినేట్ చేసిన ముగ్గురు నాయకులు ఎలాగూ అధికారపార్టీకి చెందిన వారే ఉంటారు. జిల్లాలో ఎంపీపీలూ అదే పార్టీకి చెందిన వారు. దీంతో ఆ నలుగురూ ఎవరి పేరును సూచిస్తే వారికే రుణం అందుతుంది. దీంతో ఈ కమిటీలోని అధికారులు నామమాత్రంగా ఉండాల్సి వస్తోంది.
జోరుగా బేరసారాలు
ప్రభుత్వ నిబంధనల కారణంగా రుణాల కేటాయింపులో టీడీపీ నాయకుల పాత్ర కీలకం కావడంతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులతో జోరుగా బేరసారాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల అనుచరులు రంగప్రవేశం చేసి అభ్యర్థులతో బేరాలకు దిగుతున్నారు. ఉదాహరణకు ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే అనుచరులుగా చెలామణి అవుతున్న వారు లక్ష రూపాయల రుణ యూనిట్ మంజూరు కావాలంటే రూ.25 వేలు కమీషన్‌గా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని పలువురు లబ్ధిదారులు తెలిపారు. ఎస్సీ డివిజన్లలోని సంబంధిత కార్పొరేటర్లకు రెండు, మూడు యూనిట్లు కేటాయించి మిగిలినవి బహిరంగంగానే బేరసారాలు జరుపుతున్నారు. దాదాపు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది.
ఏమిటీ దారుణం
Published Fri, Sep 11 2015 1:51 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement