టీడీపీ నేతలకు షోకాజ్ నోటీసులు | tdp rayachoti tdp incharge gets notice | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలకు షోకాజ్ నోటీసులు

Published Thu, Jun 2 2016 4:18 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM

వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇద్దరు టీడీపీ నేతలకు అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

రాయచోటి: వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇద్దరు టీడీపీ నేతలకు అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాయచోటి నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు, కడప నియోజకవర్గ టీడీపీ నేత దుర్గాప్రసాద్‌లకు టీడీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ తెలిపారు.

అయితే టీడీపీలో కార్యకర్తలకు ఎలాంటి న్యాయం జరగలేదని, కేవలం డబ్బులు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, కార్యకర్తలను కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే వాడుకుంటున్నారని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, క్రమశిక్షణ ఉల్లంఘించారని టీడీపీ అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కడపలో కాపు సంఘం సమావేశంలో దుర్గాప్రసాద్ అనుచరులు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే కారణంతో ఆయనకు కూడానోటీసులు జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement